డిసెంబర్ నెలాఖరులో శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అనుకూలంగా రాకుంటే యుద్ధానికి సిద్ధంగా ఉండా లని మెదక్ ఎంపీ విజయశాంతి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో ఎన్నడు లేని విధంగా ఆరునెలల కాలంలో 650 మంది ఆత్మహత్యలు చేసుకున్న సమయంలో మరో వైపు సమైక్య రాష్ట్రంలో అవతరణ దినోత్సవం జరుపుకోవాలని అనడం భావ్యమా అని ప్రశ్నించారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్ని విధాలుగా మోసానికి గురైందని, అందువల్లే ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు కోసం విద్యార్థులు ప్రాణాలు సైతం పొగొట్టుకుంటుంటే మరోవైపు మం త్రులు, ఎమ్మెల్యేలు అవతరణ దినోత్సవంలో పాల్గొంటామని పేర్కొనడం దారుణమన్నారు.