మహిళలను లక్షాధికారులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి మాటలను ప్రస్తుత ప్రభుత్వం నీటి మూటలుగా మార్చింది. పావలా వడ్డీ రుణాల కోసం మహిళా సంఘాలు ఎదురుచూస్తున్న స్థాయిలో కేటాయింపులు లేకపోవడంతో సభ్యులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ప్రత్యామ్నాయంగా సూక్ష్మ సంస్థల నుంచి, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలను పొందే దిశగా మహిళా సంఘాల సభ్యులు మొగ్గు చూపుతున్నారు.
రోజు రోజుకి రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్‌ల మరణ శాసనాన్ని ఆపలేకపోతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 65మంది ఆత్మహత్యలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌ను మైక్రో సంస్థలు ఏమాత్రం లెక్కచేయడం లేదు. మైక్రోఫైనాన్స్ సిబ్బంది వేధింపులకు గురిచేస్తే వెంటనే వారిపై కేసులు నమోదుచేయాలని అధికారులను ఆదేశించినా ... మైక్రోసంస్థల ప్రతినిధులు, ఉద్యోగులు యథావిధిగానే రుణం తీసుకున్న మహిళల ఇళ్లకు వెళుతున్నారు. వారం వారం కట్టాల్సిన డబ్బులను కట్టాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మహిళలను బెదిరింపులకు కూడా గురిచేసినట్లు తెలిస్తోంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పావలావడ్డీ పథకాన్ని 2004లో ప్రవేశ పెట్టారు... పావలావడ్డీ పథకం తో . ప్రభుత్వం మహిళలను లక్షాధికారి చేస్తామన్న ప్రకటన అమలు కాకపోవడం.. తో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది దీంతో మహిళలు మైక్రోఫైనాన్స్ వైపు మొగ్గుచూపారు. .అన్నది వాస్తవం
సూక్ష్మ రుణ సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. రిజర్వు బ్యాంక్ మార్గదర్శకాలకు లోబడి నిర్వహించేది కొన్ని మాత్రమే ఉన్నాయి. మిగిలినవి అనధికారికంగా లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. సూక్ష్మ రుణ సంస్థలు యాజమాన్యాలు రుణం వసూళ్లుచేసే తీరు దారుణంగా తయారైంది. సూక్ష్మ రుణ సంస్థల సిబ్బంది ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారు. 10మంది సభ్యులు ఉంటే వారిలో ఏ ఒక్కరు కట్టకపోయినా మిగిలిన 9మంది కట్టని సభ్యురాలి డబ్బులు తప్పక చెల్లించాలి. లేని పక్షంలో మొత్తం సభ్యులను డబ్బులు కట్టేంత వరకు వారిని అక్కడే నిలబెడతారు. దాంతో పరువుకోసం మహిళలు మరోచోట అధికవడ్డీలకు అప్పు చేసి డబ్బులు తెచ్చి వీరికి కట్టి వీరి వేధింపుల నుంచి బయటపడతారు. స్వయం సహాయక గ్రూపులు..మహిళా గ్రూపులు ... పొదుపు చేసుకుంటే... కార్ఫస్ ఫండ్ అందుబాటులో ఉన్నట్లు అధికారిక లెక్కల ద్వారా చెబుతున్నా బ్యాంక్ లింకేజ్ రుణాలు, పావలావడ్డీ రుణాలను తీసుకోవాలంటే సవాలక్ష ధ్రువీకరణలు, వివరణలు ఇచ్చుకుంటేగాని రుణం వచ్చే పరిస్థితిలేదు. దాంతో సూక్ష్మ రుణ సంస్థల వార్షికాదాయం జిల్లాలో గణనీయంగా పెరిగింది.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పావలావడ్డీ పథకాన్నికి సక్రమంగా అమలు చేసి అధిక నిధులు కేటాయించి మహిళలను ఆదుకుంటే సూక్ష్మ రుణ సంస్థల ఆగడాలను కొంతమేర అయినా అరికట్టవచ్చునని మహిళా సంఘాలు అంటున్నాయి.