17, నవంబర్ 2010, బుధవారం

కరుణానిధి చేతుల మీదుగా "జెమిని" జీవిత చరిత్ర

ఐదు దశాబ్దాలపాటు తమిళ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన ప్రఖ్యాత తమిళ నటుడు జెమిని గణేషన్ 90 వ జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుని జీవిత చరిత్రను పుస్తక, డివిడీ రూపంలో ఆవిష్కరించనున్నట్టు జెమిని గణేషన్ కూతురు కమల సెల్వరాజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

నవంబర్ 21 తేదిన ముఖ్యమంత్రి కరుణానిధి చేతుల మీదుగా జెమిని గణేషన్ జీవిత చరిత్రను పుస్తకాన్ని
ఆవిష్కరిస్తుండగా... తొలి ప్రతిని ప్రముఖ సినీ రచయితలు వాలీ, వైరముత్తులు అందుకోనున్నారు. అలాగే
జెమిని తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలకు అందించిన సేవల్ని పొందు పరిచిన డీవీడీ తొలి కాపీని ప్రముఖ దర్శకుడు బాలచందర్ స్వీకరించనున్నారు.

తమిళ, తెలుగు, హిందీ, మళయాళ, కన్నడ భాషల్లో 200 చిత్రాలకు పైగా నటించిన జెమినీ మార్చి 22, 2005 సంవత్సరంలో కన్నుమూసిన విషయం విదితమే