పత్రికా రంగంలో ఈ ఏడాది కనబరిచిన విశిష్ట సేవలకు గుర్తింపుగా తెహల్కా వారపత్రికకు ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్- ఇండియా (ఐపిఐ) అవార్డు లభించింది. ఈ అవార్డు కింద రెండు లక్షల నగదు బహుమతితో పాటు ఒక ట్రోఫీని, జ్ఞాపికను విజేతకు అందచేస్తారు.
మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎఎస్ ఆనంద్ నేతృత్వంలోని ఈ అవార్డు ఎంపిక జూరీలో హిందూ పత్రిక సంపాదకుడు ఎన్ రవి, మళయాళ మనోరమ మేనేజింగ్ ఎడిటర్ ఫిలిప్ మాథ్యూ, పిటిఐ ప్రధాన సంపాదకుడు ఎంకె రజ్దాన్, బిజినెస్ స్టాండర్డ్ పత్రిక సంపాదకుడు టిఎన్ నైనన్ సభ్యులుగా వున్నారు. ఈ అవార్డును వచ్చే నెలలో న్యూఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో అందజేయనున్నారు.