23, జనవరి 2011, ఆదివారం

ఫిబ్రవరి 22న అసెంబ్లీ ముట్టడి : మంద

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పిన్చని పక్షంలో ఫిబ్రవరి 22న అసెంబ్లీని ముట్టడిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు.

అసెంబ్లీలో వర్గీకరణ తీర్మానం ముందే చేయడం ఉషామె హ్రా కమిషన్ వర్గీకర ణకు అనుకూలంగా రిపోర్టు సమర్పించడంజరిగిందని, ఇప్పటికే ఏళ్ళ తరబడి నానుస్తున్న వర్గీకర ణ సాధించేందుకు జనవరి 31లోపు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకొని వెళ్లాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో వర్గీకరణ చేస్తామని పేర్కొన్న కాంగ్రెస్‌పార్టీ పార్లమెంట్‌లో బిల్లు పెట్టేందుకు జాప్యం చేస్తే వేలాదిగా తరలివచ్చి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చ రించారు.