వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణకు సర్వం సిద్దం చేశారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ ఇవ్వాలని, హైరిస్క్ గ్రూప్‌కు చెందిన పిల్లలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యెక పోలియో బూత్‌ల్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలియో చుక్కల కార్యక్రమం జరుగుతుంది.