కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న జగన్‌మోహన్‌రెడ్డితో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న ఎమ్మెల్యేలకు ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఝలక్ ఇచ్చారు. జగన్ వెంట వెళ్లే ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి గెలవాలని, ఆ తరువాత ఎవరి వెంట అయినా వెళ్లవచ్చని సీఎం వ్యాఖ్యలకు స్పందించి ప్రభుత్వానికి, కాంగ్రెస్స్ పార్టీకి వ్యతిరేకంగా జగన్ వెంట వెళ్లే ఎమ్మెల్యేలు రాజీనామా లకు సిద్ధపడటం అంత సులువు కాదు. సీఎం వ్యాఖ్యలకు తొందరపడి ఎలా స్పందిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న జాగ్రత్తలలో వీరు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే జగన్ వర్గ నేతలు రచ్చబండలో పాల్గొనక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి. హాజరుకాకపోతే వైఎస్ జలయజ్ఞానికి వీరు దూరంగా ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవు తాయి. రచ్చబండలో లబ్ధిదారులకు పలు రకాల పథకాలు పంపిణీ జరుగుతుంది. ఈ పరిస్థితులలో వీరు పాల్గొనకపోతే ఆ నియోజకవర్గంలోని ఇతర కాంగ్రెస్ నాయకులు, రెందోకేదర్ రేచిపోవటమే కాకుండా తమ ప్రాధాన్యాన్ని రచ్చబండలో పెంచు కునే అవకాశముంద న్న భయం వారిలో నెలకొలి పెందుకే కిరణ్ వ్యూహాత్మకంగా రాజీనామాల వ్యవహారం తెరపైకి తెచ్చారు. దీంతో రెచ్చిపోయే రాజీనామాలు చేఇంచి ప్రభుత్వాన్ని పడగొడితే వైఎస్ తెచ్చిన ప్రభుత్వాన్ని కూలగోట్టాదన్న అపప్రద తెచ్చేందుకు వ్యాఖ్యలు చేసారని అనీ చెప్పే వారూ లేకపోలేదు. మరి ఇప్పుడు జగన్ గ్యాంగ్ పరిస్తితి కుడితిలో పడ్డ ఎలకలా ఉందనీ చెప్పక తప్పదేమో.