23, జనవరి 2011, ఆదివారం

కేంద్రం వేచి చూసే ధోరణికి స్వస్తి పలకలన్న సమైక్యాంధ్ర జేఏసీ

శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయాలని సమైక్యాంధ్ర జేఏసీ డిమాండ్ చేసింది. సీమాంధ్రలోని 14 వర్సిటీల్లోని విద్యార్థులంతా గాంధేయ మార్గంలో ఉద్యమిస్తున్నారని అయితే తెలంగాణాలో మాత్రం విద్యార్థులను వేర్పా టు వాదులు రెచ్చగొట్టి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ శామ్యూల్ ఆవేదన వ్యక్తం చేసారు.

తెలంగాణాలో జరిగిన పీజీ పరీక్షలకు పది వేల మందికి గాను కేవలం 1500 మంది మాత్రమే పాల్గొని మిగిలిన వారు హాల్ టిక్కెట్లు చించివేయడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం వేచి చూసే ధోరణికి స్వస్తి పలకాలని, సీమాంధ్ర ఎంపీలంతా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండే విధంగా వారిపై ఒత్తిడి తెస్తామన్నారు ఎన్ శామ్యూల్ .