తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉన్న ముస్లింలు సైతం ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నారని జమాతే ఇస్లామి హింద్ ప్రకటించింది. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్‌లో మహాగర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఎస్ఐవో అధ్యక్షు డు మొగద్‌హాదీ చెప్పారు.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ తెలంగాణ గర్జనకు అన్ని వర్గాల ముస్లింల తో పాటు తెలంగాణ వాదులు పెద్దసంఖ్యలో హాజరై విజయంతం చేయాలని కోరా రు.