మంత్రి దానం నాగేందర్‌ను అడ్డుకుని నిరసన తెలుపుతు న్న తెలంగాణవాదులను ఎమ్మెల్యే జ గ్గారెడ్డి విచక్షణారహితంగా పిడిగుద్దులు గుద్దుతూ కార్యకర్తలచే తెలంగాణ దీక్ష శిబిరంపై దాడి చేయడం, అరాచక చర్యలకు పాల్పడడం సిగ్గు చేటని మెదక్ ఎంపీ విజయశాంతి వ్యాఖ్యానించారు.
ఈ దాడి సభ్య సమాజానికే ఏవగింపు కలిగిస్తోందని, ప్రైవేటు గుండాలచే దీక్షా శిబిరంలో కూర్చున్న తెలంగాణవాదులపై దాడి చేసి భయబ్రాంతులకు గురిచేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.