తెలంగాణ దృష్టిని మరల్చడానికి రాష్ట్రప్రభుత్వం చేపట్టి న రచ్చబండ కార్యక్రమాన్ని రద్దుచేయాలని శాసనసభ టీఆర్ఎస్ ఉపనేత టి.హరీష్‌రావు డిమాండ్ చేశారు. ప్రజలు రచ్చబండ, రేషన్‌కార్డులు కాదని, తెలంగాణ కోరుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేట్టు కాంగ్రెస్‌నాయకులు కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొనిరావాలని హరీష్ రావు సూచించారు. జన అబిప్రాయాన్ని కాదని పోలీసు పహారాలో జరిగీ రచ్చ బండల్ని రచ్చ చేస్తామని హెచ్చరించారు.