తమ వాదనలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై భౌతిక దాడులకు దిగుతుంటే బజారు రౌడీలకూ, ప్రజాప్రతినిధులకూ తేడా ఏమిటని ఎంపీ కావూరి సాంబశివరావు ప్రశ్నించారు.శాసనసభలో గురువారం జరిగిన సంఘటనలు ప్రజాస్వామ్యవాదులు బాధపడేవిగా ఉన్నాయన్నారు. . "రాష్ట్రం రెండుగా విభజించడానికేం ఖర్మ.. ప్రతి 50 వేల జనాభాకూ ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్-సికింద్రాబాద్‌లను 8 రాష్ట్రాలుగా, కృష్ణా జిల్లాను 12 రాష్ట్రాలుగా విభజించాలని కోరుకుంటున్నాను'' అని వ్యంగ్యంగా అన్నారు. మరో పది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను కొడితే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ నెరవేరుతుందనుకుంటున్నారేమోనని ఆయన సందేహం వ్యక్తం చేశారు.