లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణపై దాడికి పాల్పడిన వారిని, ఘటనకు కారణమైన కేసీఆర్, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సమైక్యాంధ్ర జేఏసీ డిమాండ్ చేసింది. తెలంగాణ నాయకుల ఆగడాలు తాలిబన్ల చర్యలను మించి పోతున్నాయని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నాయకులపై చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం బాధ్యతలు విస్మరించిందని ఆరోపించారు. శాసనసభ్యునికి హైదరాబాద్ నడిబొడ్డున రక్షణలేకపోతే ప్రభుత్వం సామాన్యుని భద్రతకు ఏమి హామీ ఇవ్వగలదని ప్రశ్నించారు
జయప్రకాష్ నారాయణపై దాడికి నిరసనగా శుక్రవారం సీమాంధ్ర పరిధిలోని విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నామని సమైక్యాంద్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో- కన్వీనర్ ఎం.వెంకటరమణ తెలిపారు.
జయప్రకాష్ నారాయణపై దాడికి నిరసనగా శుక్రవారం సీమాంధ్ర పరిధిలోని విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నామని సమైక్యాంద్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో- కన్వీనర్ ఎం.వెంకటరమణ తెలిపారు.