యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నుంచి తలపెట్టిన ‘ఫీజు పోరు’కు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర నేత వీజీఆర్ నారగోని ప్రకటించారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఫీజుల చెల్లింపులో ప్రభుత్వం కప్పదాటు వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. పదవి కాపాడుకునేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారని, ఆయనకు ఒక్క క్షణం అధికారంలో ఉండే అర్హత లేదని ధ్వజమెత్తారు.