చంద్రబాబు, చిరంజీవి, సీపీఎం ఎవరు వద్దన్నా... పార్లమెంట్‌లో బిల్లు పెడితే ఎన్డీఏ బలంతో తెలంగాణ వస్తుంది. 2014లో ఎలాగూ మేమే అధికారంలోకి వస్తాం. తెలంగాణ ఇస్తాం' అన్నారు. 'తెలంగాణ ఇచ్చుడో... కాంగ్రెస్ చచ్చుడో...' ఇప్పుడు ఆ పార్టీ ముందున్న అంశమని పేర్కొన్నారు. ఎన్డీఏ హయాంలో ఏర్పాటైన ఉత్తరాంచల్, చత్తీస్‌గడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయని గుర్తు చేస్తూ...తెలంగాణ వచ్చాక ఇక్కడా బీజేపీ బలపడుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, శాసనసభ్యుడు జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.