అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు చోటుచేసుకున్న పరిణామాలు తమకు మంచి మైలేజీ ఇచ్చాయని టీఆర్ఎస్ భావిస్తోంది. సభలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని, బయట లోక్‌సత్తా అధినేత జేపీపై దాడి చేసిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు సంతోషంగా కనిపించారు. కాగా.. తెలంగాణ రాష్ట్రం కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలనే డిమాండ్‌తో టీఆర్ఎస్ శుక్రవారం వాయిదా తీర్మానం ఇచ్చి, దానిని అనుమతించాలని కోరుతూ సభలో ఆందోళనకు దిగనున్నట్లు సమాచారం.