శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేలా లేకపోవడం దురదృష్టకరమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి గురువారం వ్యాఖ్యానించారు. కమిటీ తన పరిధి దాటి వ్యవహరించి ఒక పార్టీ చెప్పినట్లుగా నివేదిక రూపొందించినట్లు ఉందని అభిప్రాయపడ్డారు.
శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంలో రహస్యంగా ఉంచిన అంశాలు బహిర్గతం చేయాల్సిందేనని జస్టిస్ నర్సింహారెడ్డి అన్నారు. నివేదికలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ ఇలాంటి నివేదికను ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఉన్నవి, లేనివి నివేదికలో జోడించారని న్యాయమూర్తి వాఖ్యానించారు.