ఇంటర్ పరీక్ష వాయిదా కుదరదు...
ఈనెల 10వ తేదీన మిలియన్ మార్చ్ సందర్భంగా ఇంటర్ పరీక్షను వాయిదా వేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్ పరీక్ష వాయిదాపై మాధ్యమిక విద్యా శాఖమంత్రి, ముఖ్యమంత్రి ఇంటర్ బోర్డు అధికారులతో చర్చించి.. లక్షలాది విద్యార్ధుల భవిష్యత్‌ని దృషిలో ఉంచుకుని ఎట్టి పరిస్ధితిలోనూ వాయిదా వేయకూడదని నిర్ణయించారు. ఈమేరకు ఇంటర్ పరీక్ష యథాతథంగా జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షల నిర్వాహణకు ఉద్యోగులు సహాయ నిరాకరణ పేరుతో సహకరించకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లుకు రంగం సిద్ధం చేస్తోంది.పరీక్షల నిర్వహణపై అఖిలపక్షంతో కూడా చర్చించాలని.. రిటైర్డ్ లెక్చరర్లతో పరీక్షలు నిర్వహించాలని.... నిర్ణయించినట్లు సమాచారం.