ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసాక చిరంజీవి గ్యాంగ్‌కి మంచి ఛాన్సే దొరికింది. తాజాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డితో చిరంజీవి జరిపిన చర్చలు ఫలించి పీఆర్పీకి ఓ ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అలాగే ఎంఐఎంకి కూడా ఓ ఎమ్మెల్సీ సీటు ఖాయంగా కనిపి స్తోంది.
శాసన సభ్యుల కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యేందుకు ఆశావాహులు పదుల సంఖ్యలో క్యూలో ఉన్నప్పటికి తాజా రాజకీయ పరిణామాలలో పీఆర్పీ, ఎంఐఎంల ఎమ్మెల్యేల సహకారం అవసరం కావటంతో చెరో సీటు ఇచ్చేందుకు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం సూచించినా.. పీఆర్పీ రెండు సీట్ల కోసం పట్టుబట్టినా ఫలితం లేకపోయిందన్నది వాస్తవం.