జీతాల చెల్లింపునకు అoగీకరించిన ప్రభుత్వం
జీతాలు చెల్లించాలని ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం దిగివచ్చింది. ఎట్టకేలకు జీతాల చెల్లింపుకు ప్రభుత్వం అంగీకరించింది. శుక్రవారం సచివాలయం ఉద్యోగులు జీతాల కోసం సీఎం కార్యాలయం 'సి'బ్లాక్ ఎదుట బైఠాయించారు. తమ జీతాలు వెంటనే చెల్లించాలని వారు నినాదాలు చేశారు. దీంతో సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి వచ్చి ఉద్యోగులతో చ ర్చలు జరిపారు. జీతాలు చెల్లించేందకు ప్రభుత్వం అగీకరించటంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు.