కాంగ్రెస్ అవినీతి భాగోతమంటూ దేశాన్ని ఓ కుదుపు కుదిపిన బోఫోర్స్ కేసుని మూసివేశాయడానికి ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. తాము విచారణ జరుపుతూ ఏళ్లు గడుస్తున్నా.. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లభించనందున కేసుని మూసివేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టుని సిబిఐ కోరింది.
సిబిఐ పిటీషన్‌ని పరిశీలించిన హైకోర్టు వారి విన్నపాన్ని మన్నిస్తూ.. కేసు ఉపసంహరణకు సూచన ప్రాయంగా అంగీకరించడంతో.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఖత్రోచిపై కేసుని వెనక్కి తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తోంది.