వీధి పోరాటాల ద్వారా రాష్ట్ర విభజన జరగదని మాజీ సీఎం కె. రోశయ్య అన్నారు. స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఆయన విజయవాడ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ , సమైక్యాంధ్ర ఉద్యమాలవల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడడం మినహా జరిగేది ఏమీ ఉండదన్నారు. ప్రజాస్వామ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే విధంగా ఆందోళనలు చేయడం పౌర హక్కులకు విఘాతం కల్పించటమేనని రోశయ్య అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర విభజన అంశంపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక సూచించిన అంశాలను కేంద్ర ప్రభుత్వం కూలంకషంగా పరిశీలిస్తోందన్నారు. దీనిపై కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా అందరూ కట్టుబడి ఉండాలని హితవు చెప్పారు.