ఫ్రాన్స్‌లో ఇకనుంచి బురఖాలు ధరించేవారికి ఫైన్ వేయనున్నారు. బురఖాలు ధరించడాన్ని నిషేధిస్తూ గత ఏడాది ఫ్రాన్స్ నిర్ణయం తీసుకుంది. అది ప్రస్తుతం పూర్తి స్థాయిలో అమలులో లేదు. అయితే, వచ్చే నెల 11 నుంచి బురఖాలపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయనున్నారు. ఒకవేళ్ల బురఖాలు ధరించినప్పటికీ, పోలీసులు అడిగినప్పుడు,
వాటిని తొలగించకపోతే వారిని జైలుకు తీసుకెళ్లి విచారణ చేపట్టొచ్చు లేదా వారికి సుమారు రూ.10 వేల (208 డాలర్లు) వరకు ఫైన్ వేయొచ్చు. అయితే, దీనిపై కొన్ని ముస్లిం సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిని అలుసుగా తీసుకుని పోలీసులు అతిగా ప్రవర్తించే అవకాశం ఉందని అవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.