6, మార్చి 2011, ఆదివారం

9 నుంచి అరసవల్లిలో అద్భుత కిరణస్పర్శ

: ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి «ద్రువ మూర్తిని ఆదిత్యుని తొలికిరణాలు తాకే అద్భుత దృశ్యం ఆవిష్కాృతం కాబోతోంది. స్వామి పాదాలమీద మొదలై శిరో భాగం వరకు సూర్యకిరణాలు ప్రసరించే ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు అరసవల్లి తరలివస్తారు. కిరణాలు తాకినప్పుడు మూలవిరాట్ బంగారు ఛాయలో మెరిసిపోయే కమనీయ దృశ్యం భక్తులకు కనువిందు చేస్తుంది. గత ఏడాది 9,10 తేదీల్లో సూర్యుడు మబ్బులు మధ్య దోబూచులాడడంతో ఈ అపురూప దృశ్యం తిలకించే అవకాశం 11న మాత్రమే భక్తులకు కలిగింది. ఇదిఇలా వుండగా, గతంలో అపురూప దృశ్యం ఆవిష్కరణ సమయంలో తలుపులు మూసివేయడంతో భక్తులు ఇబ్బంది పడిన విషయాన్ని ఆలయ ఈవో ఎన్.ముత్యాలరావుతో ఆదివారం 'ఆన్‌లైన్' ప్రస్తావించగా కిర ణస్పర్శ కొన్ని క్షణాలు మాత్రమే ఉండటంతో క్యూలైన్లలో పరిమిత సంఖ్యలో భక్తులు చూసేవీలుంటుందని, అందువల్ల ఆ రోజుల్లో సూర్యోదయ సమయానికి ముందే భక్తులు ఆలయానికి చేరుకోవాలని సూచించారు.