ప్రపంచంలోకెల్లా ధనవంతుడెవరు?.. ఈ ప్రశ్నకు సమాధానంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మొదలుకొని ప్రముఖ వ్యాపారవేత్తలు పేర్లు చెప్పేందుకు మనం యత్నిస్తాం. అయితే.. ఇకపై మనం హోస్నీ ముబారక్ పేరు చెప్పాల్సి ఉంటుంది. ఈజిప్ట్‌లో.. గద్దె దిగిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు ముబారక్‌కు ప్రపంచవ్యాప్తంగా రూ. 31 లక్షల కోట్ల (70 బిలియన్ డాలర్లు) ఆస్తులున్నాయని.. బ్రిటిష్ పత్రిక 'ది గార్డియన్' శనివారం తెలిపింది.
ఇలా 70 బిలియన్ డాలర్ల సంపదతో.. ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యధిక ధనవంతులైన మెక్సికన్ వ్యాపారవేత్త కార్లోస్ స్లిమ్ ( 53.5 బిలియన్ డాలర్లు), మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు (53 బిలియన్ డాలర్లు) బిల్ గేట్స్‌ను ముబారక్ వెనక్కు నెట్టారు.