స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి జరగనున్న ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థిగా పోటీచేస్తున్న చిట్టాబత్తుల కుమార్‌రాజా బరిలో నుంచి తప్పుకున్నారు. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యాక ఆదివారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.