సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డెరైక్టర్ సఫాయా విడుదల చేస్తున్న బులెటిన్‌లు భక్తులను తికమకపెడుతున్నాయి. ఐసీయూలోనికి ఇతరులను అనుమతించక పోయినా, కనీసం అద్దాల బయటి నుంచి అయినా కొందరికైనా బాబాను చూపించవచ్చు కదా? భక్తుల కోరిక మేరకు అద్దాల బయటి నుంచి వీడియో చిత్రీకరించి చూపడానికి అభ్యంతరం ఏమిటి? అనేవి కోట్లాది మంది మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. బాబాకు అత్యంత రహస్యంగా వైద్యం చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.