ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ఉప ఎన్నికల కష్టాలు ఒక్కొక్కటిగా వచ్చి పడుతున్నాయి. కడప లోక్‌సభ అభ్యర్థిత్వం కొలిక్కి వచ్చిందని భావిస్తున్న సమయంలో, పులివెందుల సమస్యగా మారబోతోంది. మంత్రి పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని వైఎస్ వివేకానందరెడ్డి పట్టుబడుతున్నారు. ప్రజలు ఇచ్చే అధికారమే తనకు కావాలని.. నామినేటెడ్ పదవులు వద్దని ఎన్నికల ప్రచార సభలో స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసినందున మంత్రి పదవి కూడా నామినేటెడ్ వంటిదేనని ఆయన అభిప్రాయపడుతున్నారు.