ఒకవైపు అన్నాహజారే ఢిల్లీలో చేపట్టిన దీక్షకు మద్దతు ఇస్తున్నట్లు స్వయంగా శివసేన అధినేత బాల్‌ఠాక్రే ప్రకటించగా మరోవైపు శివసేన ఎమ్మెల్యే, మాజీ మంత్రి సురేష్‌దాదా జైన్ మాత్రం ప్రముఖ సంఘసంస్కర్త, గాంధేయవాదిగా వెలుగొందుతున్న అన్నాహజారే ‘ఫ్రాడ్’ అని, ఆయన కార్యకర్తలు నేరస్తులు, బ్లాక్ మెయిలర్లని, అనవసరంగా ఆయన్ని మహాత్మాగాంధీని చేయవద్దని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సర్వత్రా ఆశ్చర్య పోయేలా చేసారు.
గతంలో జైన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతోపాటు మరో నలుగురు మంత్రులకు వ్యతిరేకంగా అన్నాహజారే ఆందోళన చేపట్టారు. అప్పటినుంచి అన్నాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తునే .. ఇందులోభాగంగానే అన్నాకు దీటుగా జైన్ కూడా నిరాహార దీక్ష చేప ట్టిన విషయం తెలిసిందే. సావంత్ కమిషన్ విచారణలో హజారే అవినీతి బయటపడిందని, అనవసరంగా ఆయనను గాంధీతో పోల్చవద్దంటూ వ్యాఖ్యానించారు