బి జే పీతోనే సుపరిపాలన సాధ్యమవుతుందని ప్రముఖ నటి హేమమాలిని పేర్కొన్నారు. గత 50 సంవత్సరాలుగా అధికార పీఠాన్ని అంటిపెట్టుకున్న కాంగ్రెస్ వల్ల చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగకపోవడం శోచనీయమన్నారు. భారతదేశంలో అవినీతి పెల్లుబుకుతోందని, ఐదేళ్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో పలు అభివృద్ధి పథకాలు అమలుచేసి దేశాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకువెలామ్ని, వాజ్‌పాయి, అద్వానీ వంటి నాయకులు ప్రజలు మెచ్చిన పాలనను అందించి, చరిత్రలో నిలిచిపోయారన్నారు.