ప్రేయసిగా, అందమైన అక్కగా, మంచి అమ్మగా ఇలా ఎన్నో పాత్రలకు జీవంపోసిన నటి సుజాత. ఆమె బుధవారం మృతిచెందిన విషయం తెలి సిందే. ఈమె అంత్యక్రియలు కీల్‌పాక్ క్రిస్టియన్ శ్మశానవాటికలో జరిగాయి. ఈ సందర్భంగా సుజాత భౌతికకాయానికి పలువురు చిత్ర ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకుముందు సుజాత భౌతిక కాయానికి ఆమె నివాసంలో పలువురు చిత్ర ప్రముఖులు నివాళులర్పించారు.