తొలి సినిమా ఫ్లాప్ అయితే, ఇక చాలా మంది కెరీర్ ముందుకు సాగదు. ఇందుకు భిన్నంగా శృతి హాసన్ కెరీర్ దూసుకుపోతోంది. ఆమె తొలి సినిమా 'అనగనగా ఓ ధీరుడు' ఫ్లాప్ అయినప్పటికీ, ఆమెకు ఆఫర్లు మాత్రం బాగానే వస్తున్నాయి. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ కూడా సినిమాలు చేస్తూ బిజీగానే వుంది.
తెలుగులో సిద్ధార్థ్ తో 'ఓ మై ఫ్రెండ్', యన్టీఆర్ తో బోయపాటి శ్రీను సినిమాలోనూ నటిస్తోంది. ఇప్పుడు తాజాగా మరో భారీ ఆఫర్ తన సొంతం చేసుకుంది. పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని పొందింది. ఆ సినిమా ఏదనేది మాత్రం ఇంకా వెల్లడికాకపోయినప్పటికీ, రాజు సుందరం డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ నటించే సినిమా అని అంటున్నారు. ఏమైనా, శ్రుతీకి తెలుగులో కెరీర్ బాగుందనే చెప్పాలి!