ప్రస్తుతం 'కందిరీగ' సినిమా షూటింగుని పూర్తిచేస్తున్న యువ హీరో రామ్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి తమిళ దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వం వహిస్తాడు. ప్రేమ కథా చిత్రాల రూపకల్పనలో పేరు తెచ్చుకున్న కరుణాకరన్ ఇప్పుడీ చిత్రాన్ని కూడా వెరైటీ లవ్ స్టోరీగా తీర్చిదిద్దడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. అతనితో చేయడానికి రామ్ కూడా ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ నెల 27 న ఈ చిత్రం షూటింగును హైదరాబాదులో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదట్లో ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి ప్రోడ్యుస్ చేస్తారని వార్తలొచ్చినా, తాజాగా ఈ ప్రాజక్టును రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తునన్ ఈ సినిమాకి 'ఎందుకంటే...' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. | |
|