కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజ్‌గోపాల్‌కు, పొన్నం ప్రభాకర్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పొన్నం తాజాగా లగడపాటికి సవాల్ విసిరారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, దమ్ముంటే కరీంనగర్‌లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
ధన, కుల అహంకారంతోనే లగడపాటి తనను విమర్శిస్తున్నారని పొన్నం మండిపడ్డారు. తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని సీడబ్ల్యూసీని కోరతామని ఆయన తెలిపారు.