సత్యసాయి ట్రస్ట్‌పై వస్తున్న ఆరోపణలతో తనకు సంబంధం లేదని సత్యసాయిబాబా ఆంతరంగిక శిష్యుడు సత్యజిత్ స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం తొలిసారి మీడియా ముందు నోరు విప్పారు. తాను కేవలం బాబా భక్తుడిని మాత్రమేనని, ఆయనకు సేవ చేసుకునేందుకు మాత్రమే వచ్చానన్నారు. ట్రస్ట్ వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని సత్యజిత్ అన్నారు.