లయం వచ్చి ప్రపంచమంతా నాశనమైపోనీ.. ఈ చిప్‌కి ఏమీ కాదట! 1000 డిగ్రీల వేడి
సైతం దీన్లోని డేటాని దగ్ధం చేయలేదట. నీళ్లల్లో పడ్డా నిక్షేపంగా పైకి
తేలుతుందట. రేడియేషన్, రసాయనాలతోనూ చెక్కుచెదరదట. ఇందులో దాచే సమాచారం 10
కోట్ల సంవత్సరాల దాకా పాడవకుండా ఉంటుందట. ఇంతకీ ఏమిటీ చిప్? బోలెడన్ని
ఫొటోలు.. ఇష్టమైన సినిమాలు.. నచ్చిన పాతపాటలు.. వీటన్నిటినీ దాచుకోవాలంటే
మనకు పెద్దఎత్తున స్టోరేజ్ డిస్కులు కావాలి! సీడీలు, డీవీడీలూ, బ్లూరే
డిస్కులు గీతల వల్ల పాడైపోయే ముప్పు ఉంది.
టెరాబైట్ల సామర్థ్యం గల ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్కులు కరెంటు సరఫరా సరిగా లేకపోతే అవీ పాడైపోయే ప్రమాదం ఉంది. దీంతో, ఈ సమస్యకు చెక్‌పెట్టే అద్భుత 'చిప్'నొకదాన్ని తయారుచేసినట్టు హిటాచీ కంపెనీ ప్రకటించింది. క్వార్ట్జ్ గ్లాస్‌తో రెండుపొరలుగా ఈ చిప్‌ను రూపొందించినట్టు తెలిపింది. అంతాబానే ఉందిగానీ.. ఒక చదరపుటంగుళం చిప్‌లో 40 ఎంబీ డేటా మాత్రమే పడుతుంది.