అందానికి ఎన్ని మార్కులుపడ్డా అభినయం
తోడైతేనే పాస్ మార్కులు,ముఖానికి నవ్వే అందం, అందంవల్ల సంతోషం కలుగుతుంది,
ఆనం వల్ల ఆరోగ్యం సమకూరుతుంది.కొంతకాలం క్రితం వరకు హీరోయిన్లు ముద్దుగా,
బొద్దుగా, ముద్దమందారంలా, ముద్దబంతిపువ్వులా (ఇప్పటికీ తమిళ సినీ పరిశ్రమలో
అదే కొనసాగుతుంది) ఉండాలనుకొనే వారు. హీరోలు విశాలమైన ఛాతీ, కండలు తిరిగిన
వొళ్ళు ఉంటే, హీరోయిన్‌కు యెద పుష్టి, బొద్దుగా ఉండే శరీరం కలిగితే
చూడముచ్చటైన జంటగా భావించేవారు. ఇప్పుడు ఛాతీ లేదా యెద కన్నా వాటి కింద
భాగమైన పొట్టపైనే దృష్టి పెడుతున్నారు. హీరోలు సిక్స్ ప్యాక్ లేదా ఎయిట్
ప్యాక్, హీరోయిన్ అయితే '0'సైజ్. అప్పట్లో ముఖపర్చస్సుతో పాటు
నాటకానుభవం, కంఠస్వరం చూసి తీసుకొనే వాళ్ళు. కనుక సినిమా హీరోయిన్లుగా
ఛాన్స్ కొట్టేసరికి ఏ పాతికపైనో వయస్సుండేది. టీనేజ్ అమ్మాయిలు
హీరోయిన్లు అవుతారని వారు ఊహించి ఉండరు. ఇప్పుడు ముఖ పర్చస్సు, ముఖంలో
హావభావాలు పలికించగలిగి, కొరియో గ్రాఫర్ స్టెప్పులకు అనుకూలంగా శరీరాన్ని
కదిలించగలిగితే చాలు. కంఠస్వరం, భాష పట్టింపుల్లేవు. కాలం అనేక మార్పులకు
లోనవుతుంది. ఆ మార్పులకు నాంది కొత్తదనం. కొత్తొక వింత పాతొక రోతఅనే సామెత
వచ్చింది అందుకే! ఈ కొత్త కూడా పాతపడ్డప్పుడు అంతకు ముందున్న పాతదే
కొత్తగా (కనిపిస్తుంది) వస్తుంది. దీన్నే కాలచక్రం అనికూడా అనొచ్చేమో!
ఉదాహరణకు ముక్కు పుడకనే తీసుకోవచ్చు. నిన్నటి మొన్నటి వరకు ముక్కు పుడకను
వాడటాన్ని ఇష్టపడని యువతులు, హీరోయిన్లు నేడు మక్కువ చూపుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే శ్రీదేవి, జయప్రద రాకతో హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి అనే భావన అటు ఇండస్ట్రీలోను ఇటు ప్రేక్షకుల్లోనూ కలిగేలా చేసారు. చలాకీగా, హుషారుగా, చిలిపిగా, సరసంగా నటించి (సినిమాలో) అటు హీరో నిద్రలోకి, ఇటు ప్రేక్షకుల నిద్రలోకి కలల రూపంలో చొరబడ్డారు. అప్పటినుండి హీరోయిన్ అంటే ముద్దమందారం కాదు సన్నజాజిలా ఉండాలిఅన్న సూక్తిలాంటిది మనస్సులో నాటుకు పోయేలా చేసారు. వీరితోపాటు వచ్చిన జయసుధ, జయచిత్రలు పోటీ ఇచ్చినా చాలా వరకు కుటుంబ కథలకే పరిమితమయ్యారు. గ్లామర్ పాత్రలు ఎక్కువగా వేయక పోయినా ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేశారు. జయసుధ సహజనటిఅన్న బిరుదు తెచ్చుకొంది.
ఆ తర్వాత విజయశాంతి, రోజా, రాదిక, రాధ, భానుప్రియ, సుమలత, అంబిక, రమ్యకృష్ణ, నగ్మ, రంభ, రాశి, సౌందర్య, సుజాత వచ్చారు. సుజాత, అంబికలు మహిళల మన్ననలు పొందినా ఎక్కువకాలం నిలువలేక పోయారు. బొద్దుగా ఉండటం యువ హీరోలకు జోడీగా కుదరక పోవడం ఒక కారణం కావచ్చు. ఆ తర్వాత వచ్చిన సౌందర్య మాత్రం మహిళల మన్ననలతోపాటు కుర్రకారు మనసులను దోచి, కుటుంబ కథలకు, ప్రేమ కథలకు, దేవతా చిత్రాలకు అందం, అభినయం అనుకూలంగా ఉండటంతో పరిశ్రమ బ్రహ్మరథం పట్టింది. అకస్మాత్తుగా ఆమె చనిపోవడంతో కుటుంబ కథలు ఒక విధంగా ఆగిపోయాయనే అనుకోవచ్చు. ఇక్కడ అక్కినేని ప్రారంభించిన స్టెప్పులు వేగం పెంచుకున్నాయి. కుటుంబ కథా చిత్రాలు తగ్గుముఖం పట్టాయి. దాంతో జయసుధ, జయచిత్ర, సౌందర్యల వారసత్వం కోసం ఎవరూ ప్రయత్నించడం లేదు. అంతా గ్లామరే. రాధ, రాధిక, నగ్మాలు కాస్త బొద్దుగా ఉన్నా చిరంజీవికి ధీటుగా ఎనర్జిటిక్‌గా స్టెప్పు లెయ్యడంతో ఎక్కువకాలం రాణించగలిగారు. రాశి, మీనాలు కూడా కాస్తా బొద్దుగా ఉన్నా తమ అందం, నటన దాన్ని డామినేట్ చేయడంతో ఇండస్ట్రీలో నిలబడగలిగి, అవకాశాలు దండిగా ఉండగానే పెళ్ళి చేసుకొని పక్కకు జరిగారు. విజయశాంతి, రోజాలైతే వెండితెరను ఏలినంత కాలం ఏలి ఇప్పుడు పొలిటి కల్ తెరపై తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు.
ఇక్కడ కొత్తదనం మరో స్టెప్పు ముందుకు వేసింది. దాని పేరే మల్లె తీగ లేదా మెరుపు తీగ ఇంతవరకు కొంత మందైనా సినిమా అనేది ఒక కళ అని, ఒక మాధ్యమం అని అంటుండేవారు ఇప్పుడిది పూర్తిగా వ్యాపారం అయ్యింది. నిర్మాణ వ్యయం 20, 30 కోట్లకు చేరింది. 50, 60 కోట్లు వసూలు చేస్తే మామూలు సక్సెస్. వందకోట్లు రాబట్టగలిగితే గొప్ప సక్సెస్. దానికి దగ్గరి సూత్రం ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి రిలీజ్ చెయ్యడం, వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చెయ్యడం. అంతే కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మీడియాలో ఎన్ని స్టంట్స్ చేస్తున్నా, తెరపై అందాలను ఆరబోయడానికి కొత్తవారిని ఎన్నుకుంటున్నారు. కొత్తవారైతే తొలి అవకాశం ఇస్తున్నారన్న ఆనందంతో ఆరబోయవచ్చు. పాతవారు ఒప్పుకున్నా ప్రేక్షకులకు కొత్తగా కనిపించక పోవచ్చు. ఈ రెండు కారణములతో కొత్తవారికి ఛాన్సులు మెరుగయ్యాయి. ఒక్కో సినిమాకు ఒక్కరికన్నా ఎక్కువగా కూడా హీరోయిన్సుకు అవకాశాలు దొరకడం మొదలైంది. ఇక్కడ హీరోయిన్ జీవితకాలం తగ్గింది. మొదటి మూడు సినిమాలలో మొదటిది హిట్ లేదా బిగ్గెస్ట్ హిట్ కావాలి.
మిగతా రెండు సినిమాలలో ఒక్కటి కన్నా ఎక్కువగా ప్లాప్‌లుండకూడదు. లేదంటే ఐరన్‌లెగ్‌ముద్ర ఉండనే ఉంది. ఎన్ని సక్సెస్‌లున్నా తన తోటివారితోనే గాక కొత్తవారితో పోటీపడాలి. అంటే ఇక్కడ హీరోయిన్ తన అందాన్ని, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడమేగాక ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా కొత్తందాలను చూపగలగాలి. అప్పుడే ఈ రంగుల, గ్లామర్, సెలబ్రిటి ప్రపంచంలో నాలుగు కాలాలు ఉండి, నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు.
ఈ తరహా ఆలోచనల్లోంచే పుట్టుకొచ్చింది హీరోలకు సిక్స్, ఎయిట్ ప్యాక్. హీరోయిన్లకు'0'సైజ్. ఈ టెక్నాలజీ ముందే ఉన్నా సినిమా తారలతోనే ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. సిక్స్‌పాక్ బాలీవుడ్, కోలీవుడ్‌లో కాక మన టాలీవుడ్‌లో కూడా లేటెస్టుగా సునిల్ కూడా సాధించాడు. ఇంతకు ముందు జూనియర్ ఎన్టీయార్ బొద్దుగా ఉన్న తనను ఎక్సర్‌సైజ్‌తో స్లిమ్‌గా చేసుకున్నాడు. మంచు విష్ణు కూడా ఎక్సర్‌సైజులతో బొద్దుకు దూరమైనా... ముఖంలో గ్లామర్ తగ్గినట్లుగా నీరసంగా కనిపిస్తున్నట్లు ప్రచారం జరిగింది. మహేష్‌బాబు సిక్స్ ప్యాక్ ట్రై చేసి ముఖంలో మార్పులు గమనించి ఆపేసాడట. ఇక హీరోయిన్ల విషయానికొస్తే... ఇక్కడ సన్నజాజి కూడా మోటయ్యింది.
అనుష్క, త్రిష, ఇలియానా, ప్రియమణి, నయనతార, తమన్నా, సమంత, కాజల్ లాంటి మెరుపు తీగలకే డిమాండ్ ఏర్పడ్డది. ఇప్పుడు బాలీవుడ్ '0' ఆదరిస్త్తోంది. టాలీవుడ్ మధ్యస్థమే ఇష్టపడుతోంది. కొలీవుడ్ మాత్రం ఇప్పటికీ బొద్దునే ముద్దు చేస్తుంది. బాలీవుడ్ ప్రవేశపెట్టిన '0'సైజ్‌ను ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ అనుకరిస్తున్నారు. బాలీవుడ్ అవకాశాల కోసం కావచ్చు లేదా ఇక్కడి ప్రేక్షకులకు కొత్తదనం చూపడం కోసం కావచ్చు. కాని ఎక్సర్‌సైజ్ చేసి ఎముకల గూడులా తయ్యారయ్యారని ఇలియానా, శ్రియ, పార్వతీ మిల్టన్‌ల గూర్చి కామెంట్లు వస్తున్నాయి. ఒక ముఖ చిత్రంపై ఆల్ట్రా మోడరన్‌గా తయ్యారైన శ్రియను చూసిన డమరుకం యూనిట్ తమఫోక్ సాంగ్‌కు చార్మిని తీసుకున్నారట.
చార్మీ కూడా ఎక్సర్‌సైజులు చేసి వళ్ళు తగ్గించుకుంది గాని మరీ ఇంత కాదు అంటున్నారు. బర్ఫీకోసం బరువు తగ్గిన ఇలియానా ( పాత్రల కోసం బరువు తగ్గడం పెరగడం అన్నది ప్రశంసించే విషయమే...గతంలో కమల్, విక్రమ్, సూర్య తదితరులు ఇలాగే చేశారు.) మరో బాలీవుడ్ అవకాశం దక్కించుకుందిట. మరి ఇదే పర్సనాలిటిని (బాలీవుడ్‌కు మకాం మార్చే అవకాశమున్నట్లుగా వార్తలు వస్తున్న సందర్భలో) మేయింటెన్ చేస్తుందో లేక వొళ్ళు చేస్తుందో చూడాలి. అయితే తన సైజుల్లో మార్పు లేదంది ఇటీవల ఇలియానా.
టెక్నాలజీ అయినా ఎక్సర్‌సైజ్‌లైనా మన శరీరానికి, మన వాతావరణానికి, మన పరిశ్రమకు ఎంతవరకు ఉపయోగపడతాయో చూసుకోవాలి. గ్రాఫిక్‌ఉంది కదా అని కథలేకుండా సినిమా తీయలేం కదా! బంగారు కత్తైనా కూరగాయలను తరుగుతామే కాని మెడను నరుక్కోలేం కదా!
అయినా 'చక్కనమ్మ చిక్కినా అందమే'అన్నారు కాని 'చక్కనమ్మ చిక్కితేనే అందం'అన్లేదు కదా. ఆ రెంటికి తేడా తెలుసుకొంటే అందరికీ (తారలకీ, వారిని అనుసరించే అభిమానులకీ) బాగుంటుంది.
ఎన్. మదనాచారి