ఎప్పుడూ నవ్వుతూ, నవ్వించే తత్వం తాప్సీది.
తనపై వస్తున్న గాసిప్స్ ఆమెను మనస్తాపానికి గురిచేస్తున్నాయని
చెప్పుకుంటున్నారు. యువ కథానాయకులు ఎవరితో నటించినా ఎఫైర్లు అంటగట్టడమే ఆమె
నొచ్చుకోవడానికి కారణమట. తెలుగుతో పాటు తమిళ చిత్రాలు చేస్తున్న ఆమె పలు
విభిన్న పాత్రలను చేయాలని కోరుకుంటోంది. ఆ మధ్య ఎన్నో అంచనాలతో విడుదలైన
'మొగుడు' చిత్రం విజయం సాధించకపోవడం ఆమెను నిరాశ పరిచింది. తాజాగా
'గుండెల్లో గోదారి', వెంకటేష్ సరసన 'షాడో', చిత్రాలు పేరు తెచ్చిపెడతాయని
ఆమె అంటోంది.