తమిళనాడు గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్యకు ప్రతిష్ఠాత్మక 'భీష్మాచార్య
పురస్కారం' లభించింది. స్థానిక టీ నగర్ హబీబుల్లా రోడ్డులోని కర్ణాటక సంఘ్
పాఠశాల ఆవరణలో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కర్ణాటకకు చెందిన
శ్రీశ్రీ విశ్వేశ తీర్థ స్వామీజీ చతుర్మాస సేవా సమితి ఆయనకు అవార్డును
ప్రదానం చేసింది.
రాజకీయ రంగంలో అపార అనుభవం గడించి, అనితర సాధ్యమైన విజయాలను నమోదు చేసినందుకే రోశ య్యను సత్కరించినట్టు సమితి ప్రతినిధులు వెల్లడించారు. ఉడిపి పెజావర్ మఠ్ పీఠాధిపతి శ్రీ శ్రీ విశ్వేశ తీర్థ స్వామీజీ హాజరై రోశయ్యకు ఆశీస్సులు అందించారు. స్వామీజీ దీవెనల కన్నా పురస్కారాలు, బిరుదులు ప్రధానం కాదని ఈ సందర్భంగా రోశయ్య అన్నారు. స్వామీజీ ఆశీస్సులు దక్కుతాయన్న ఉత్సాహంతోనే వచ్చానన్న ఆయన.. భీష్మ ఆచార్య పురస్కారాన్ని స్వీకరించేంత అర్హత ఇంకా తాను సాధించినట్లు అనుకోవడం లేదని అన్నారు.