తెలంగాణ మార్చ్‌పై సీఎం, హోమంత్రి తనతో మాట్లాడారని అయితే ఇప్పటికే
ఆలస్యమైందని, మార్చ్ వాయిదా వేయలేమని తేల్చి చెప్పినట్లు కేకే తెలిపారు.
తాను మధ్యవర్తిత్వం జరిపే ప్రసక్తే లేదన్నారు. మార్చ్ వాయిదా ప్రయత్నం
చేస్తున్నామని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంత
మంత్రులమంతా కలిసి మార్చుకు అనుమతి ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కేకే
పేర్కొన్నారు
కాశ్మీర్‌లో 45 మంది సర్పంచ్‌లో రాజీనామా చేస్తే దీనిపై రాహుల్ గాంధీ సీడబ్ల్యూసీలో ప్రస్తావించారని, అయితే తెలంగాణ కోసం 118 మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేసినా మాట్లాడినవారు లేరని, ఇది ఎంతో ఆవేదన కల్గిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.