వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు పోలీసు శాఖ కసరత్తు
ప్రారంభించింది. ఈనెల 29న జరిగే సామూహిక నిమజ్జనానికి హుస్సేన్ సాగర్‌కు
వచ్చే విగ్రహాలు, ఊరేగింపు కోసం ప్రత్యేక రూట్‌లను రూపొందించారు. ప్రధాన
ఊరేగింపునకు సాధారణ ట్రాఫిక్‌తో ఇబ్బందులు కలుగకుండా ట్రాఫిక్ ఆంక్షలు
విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ తెలిపారు. నిమజ్జనానికి
సంబంధించిన రూట్ మ్యాప్‌ను విడుదల చేశారు. విగ్రహాలు ఇలా వెళ్లాలిజూ ప్రధాన
ఊరేగింపు కేశవగిరి నుంచి ప్రారంభమై నాగుచింత. ఫలక్‌నుమా, చార్మినార్,
మదీనా, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, ఆబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ మీదుగా
ట్యాంక్‌బండ్ పైకి లేదా ఎన్‌టీఆర్ మార్గ్‌కు చేరుకుంటుంది. జూ
సికింద్రాబాద్ ప్రాంతం వినాయక విగ్రహాలు ఆర్‌పీ రోడ్డు, ఎంజీ రోడ్డు,
కర్బలా మైదాన్, కవాడిగూడ, ముషీరాబాద్, ఆర్‌టీసీ, నారాయణగూడ క్రాస్‌రోడ్స్,
హిమాయత్‌నగర్ వై జంక్షన్ మీదుగా లిబర్టీ నుంచి ట్యాంక్ బండ్ వైపు
వెళతాయి. జూ ఉప్పల్ నుంచి వచ్చే విగ్రహాలు రామంతపూర్, అంబర్‌పేట, ఎన్‌సీసీ,
దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ హాస్పిటల్ మీదుగా ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని
ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది.జూ పడమర నుంచి వచ్చే ఊరేగింపు తెలుగు తల్లి
విగ్రహం వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది.జూ విగ్రహాల తరలింపు సమయంలో
సాధారణ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 29వ తేదీ ఉదయం ఆరు నుంచి 30వ
తేదీ ఉదయం ఆరు గంటల వరకు పలుప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని
పోలీసులు తెలిపారు. ఊరేగింపు జరిగే ప్రాంతంలో సా«ధా రణ వాహనాల అనుమతిని
నిషేధిస్తున్నట్లు చెప్పారు. ఉత్తరం నుంచి తూర్పుకు వచ్చే వాహనాలకు
బషీర్‌బాగ్ జంక్షన్, బేగంపేట ప్రాంతాల్లో మాత్రమే మళ్లింపులు ఉంటాయి.
మరికొన్ని మళ్లింపు దారులు దక్షిణం: కేశవగిరి, మహబూబ్‌నగర్ క్రాస్ రోడ్స్,
ఇంజిన్‌బౌలి, నాగుల చింత, హిమ్మత్‌పూర్, హరిబౌలి, అస్రాఆస్పతి,
మొగుల్‌పురా, లకడ్‌కోఠి, మదీనా క్రాస్‌రోడ్స్, ఎంఏ బ్రిడ్జి, దారుల్‌షిపా
క్రాస్‌రోడ్స్, సిటీ కాలేజీ ప్రాంతాల్లో మళ్లింపులు ఉంటాయి.తూర్పు:
చంచల్‌గూడ జైల్ క్రాస్ రోడ్స్, మూసారాంబాద్, చాదర్‌ఘాట్ బ్రిడ్జి,
సాలార్‌జంగ్ బ్రిడ్జి, అఫ్జల్‌గంజ్, పుత్లీబౌలి క్రాస్ రోడ్స్,
ట్రూప్‌బజార్, జామ్‌బాగ్ క్రాస్‌రోడ్స్, కోఠి ఆంధ్రాబ్యాంకు వద్ద
మళ్లింపులు ఉంటాయి.పడమర: తోప్‌ఖానా మసీదు, అలాస్కా హోటల్ జంక్షన్, ఉస్మాన్
గంజ్, శంకర్‌బాగ్, సీనా హోటల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద అంజతా గేట్,
అబ్కారీ లేన్, బర్తన్ బజార్, ఏఆర్ పెట్రోల్ పంపు వద్ద
మళ్లింపులుంటాయి.మధ్యమం (సికింద్రాబాద్): వాహనాలను నెక్లెస్ రోడ్డు, అప్పర్
ట్యాంక్ బండ్ వైపు అనుమతించారు. సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్
క్రాస్‌రోడ్స్, పాట్నీ క్రాస్ రోడ్స్, బాటా క్రాస్ రోడ్స్, మండి
క్రాస్‌రోడ్స్ మీదుగా మళ్లిస్తారు.వాహనాలు ఇక్కడ పార్కింగ్
చేయాలినిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చే సందర్శకులు వాహనాలను పోలీసులు
సూచించిన ప్రాంతాల్లో పార్కింగ్ చేయాలి. ఇందు కోసం పది పార్కింగ్
పాయింట్‌లను ఏర్పాటు చేశారుఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, ఖైరతాబాద్,
ఎంఎంటీఎస్ స్టేషన్, ఖైరతాబాద్, ఆనందనగర్ కాలనీ నుంచి రంగారెడ్డి
కలెక్టరేట్ జంక్షన్ వరకు, బుద్ధ భవనం వెనుకవైపు, గో సేవా సదన్, లోయర్
ట్యాంక్ బండ్, కట్ట మైసమ్మ దేవాలయం, ఎన్‌టీఆర్ స్టేడియం, నిజాం కళాశాల,
పబ్లిక్ గార్డెన్స్.లారీలకు...జూ విగ్రహాలతో వచ్చిన లారీలు ఎన్‌టీఆర్
మార్గ్‌లో నిమజ్జనం పూర్తి చేసుకున్న అనంతరం నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్
ఫ్లైఓవర్, వీవీ విగ్రహం, కేసీపీ గేస్ట్‌హౌస్ వైపుకు వెళ్లి అక్కడి నుంచి
గమ్యస్థానాలకు చేరుకోవాలి.జూ అప్పర్ ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం అయిన వెంటనే
ఖాళీ లారీలు పిల్లల పార్కు, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ మీదు గా
వెళ్లాలి.జూ రవాణా కోసం వచ్చే లారీలను 29, 30వ తేదీలలో నగర రోడ్లపైకి
అనుమతించరు.ట్రాఫిక్ నిబంధనలు ఆర్టీసీ బస్సులకు కూడా వర్తిస్తాయని పోలీసులు
చెబుతున్నారు.
జూ మెహిదీపట్నం నుంచి వచ్చే బస్సులు మాసబ్‌ట్యాంకు వరకు నడుస్తాయి.
జూ కూకట్‌పల్లి నుంచి వచ్చే బస్సులు వీవీ విగ్రహం వరకే నడుస్తాయి.
జూ సికింద్రాబాద్ నుంచి వచ్చే బస్సులు సీటీఓ, వైఎంసీఏ, రేతిబౌలి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, క్లాక్ టావర్, చిలకలగూడ క్రాస్‌రోడ్స్ వరకు నడుస్తాయి.
జూ ఉప్పల్ నుంచి వచ్చే బస్సులు 6 నెంబర్ క్రాస్ రోడ్స్ వరకు నడుస్తాయి.
జూ మెహిదీపట్నం నుంచి వచ్చే బస్సులు మాసబ్‌ట్యాంకు వరకు నడుస్తాయి.
జూ కూకట్‌పల్లి నుంచి వచ్చే బస్సులు వీవీ విగ్రహం వరకే నడుస్తాయి.
జూ సికింద్రాబాద్ నుంచి వచ్చే బస్సులు సీటీఓ, వైఎంసీఏ, రేతిబౌలి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, క్లాక్ టావర్, చిలకలగూడ క్రాస్‌రోడ్స్ వరకు నడుస్తాయి.
జూ ఉప్పల్ నుంచి వచ్చే బస్సులు 6 నెంబర్ క్రాస్ రోడ్స్ వరకు నడుస్తాయి.