19, డిసెంబర్ 2013, గురువారం

ఎవరీ సోనియా? 5

'తెలుగు వాళ్లంటే' సోనియాకు కోపమా? అది... పీవీ నరసింహారావు నుంచే మొదలైందా? లేక... అంతకుముందు నుంచేనా? ఆమె కోపానికి కారణమేమిటి? రాష్ట్రాన్ని విభజించి తీరాల్సిందే అన్న పట్టుదల ఎక్కడి నుంచి వచ్చింది? సి.నరసింహారావు రాసిన 'సోనియా జీవన విశ్లేషణ'లో చివరి భాగం...
రాజీవ్‌గాంధీ ప్రధాని అయిన తరువాత లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే సభ్యులెవరని అడిగితే... దక్షిణాదిన తెలుగు అనే భాష మాట్లాడే రాష్ట్రం నుంచి వచ్చిన ఎంపీలని సోనియాకు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ ఇతర మిత్రపక్షాలతో కలసి 2004లో ప్రభుత్వం ఏర్పరచగానే సోనియాగాంధీ జాతీయ సలహామండలి (ఎన్ఏసీ) ఏర్పరిచారు. రాజకీయవాదులెవరికీ అందులో స్థానం కల్పించకుండా ఉన్నత విద్యావంతులు, సమాజసేవలో దీర్ఘకాలంగా పాల్గొన్నవారికే సభ్యత్వం ఇచ్చారు. వివిధ విధానాలకు ఆ సలహామండలి రూపకల్పన చేస్తుంది. ప్రభుత్వం వాటిని చేపడుతుంది. పది సంవత్సరాలుగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అనేక విధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొందరు సిద్ధాంతకర్తలు మాత్రమే వాటితో విభేదించారు. కానీ, లక్షలాదిగా ప్రజలు వీధుల్లోకి వచ్చి, అతి తీవ్రస్థాయిలో విభేదించిన నిర్ణయం ఒకే ఒక్కటి తీసుకోవడం జరిగింది. అదే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన. సోనియా చొరవతో, పట్టుదలతో తీసుకున్న నిర్ణయం ఇది. ఆమె సొంతంగా తీసుకున్న నిర్ణయం ఇది తప్ప మరొకటి లేదని చెప్పవచ్చు. సోనియాకు రాజకీయాలపైగల ఏవగింపువల్ల అసలు దినపత్రికలను ముట్టుకోరు. తన చుట్టుపక్కల ఉన్నవాళ్లు మాట్లాడే హిందీ తప్ప... భారతదేశంలోని ఇతర ప్రధాన భాషల గురించి ఆమెకు ఇసుమంతయినా తెలియదు. రాజీవ్‌గాంధీ ప్రధాని అయిన తరువాత లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే సభ్యులెవరని అడిగితే... దక్షిణాదిన తెలుగు అనే భాష మాట్లాడే రాష్ట్రం నుంచి వచ్చిన వారని ఆమెకు తెలిసింది.
సోనియా 1983లో పౌరసత్వం తీసుకోవడం గురించి, పౌరసత్వం తీసుకోకుండానే 1980లో ఆమె ఓటరుగా చేరడం గురించి లోక్‌సభలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఉపేంద్ర చాలా ఘాటుగా విమర్శించారు. ఆ విమర్శలతో ఆమె ఎంతగా గాయపడ్డారంటే... హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఉపేంద్ర ఎదురుపడినప్పుడు 'నీ అంతు చూస్తా' అని హెచ్చరించారట! దీనిపై లోక్‌సభలో గందరగోళం జరిగింది. తరువాత బోఫోర్స్ కుంభకోణం గురించి తెలుగుదేశం సభ్యులే ప్రధానంగా లోక్‌సభలో లేవనెత్తారు. సోనియా పాత్రను ప్రస్తావించారు. అసలు ఖత్రోకీ ఎవరని ప్రశ్నించారు. తెలుగుదేశం ఆనాడు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది. సభలో మాట్లాడే అవకాశం వారికే ఎక్కువగా వచ్చేది. వారితో ఇతర ప్రతిపక్షాలు జత కలిసేవి. ప్రతిపక్షంలో ఉన్న జైపాల్‌రెడ్డి (ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ, కేంద్రమంత్రి) బోఫోర్స్‌పై తీవ్ర విమర్శలు గుప్పించగా... రాజీవ్‌గాంధీ అమిత క్రోదంతో 'మీకు శారీరక వైకల్యమే కాదు, మానసిక వైకల్యం కూడా ఉంది' అని మండిపడ్డారు.
దీనిపై పార్లమెంటులో పెద్ద దుమారం చెలరేగింది. వి.పి.సింగ్ కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లడం, ప్రతిపక్షాలన్నీ కలసి కూటమిగా ఏర్పడడం, ఆ కూటమి ఏర్పాటుకు తెలుగుదేశం చొరవ తీసుకోవడం వంటివి సోనియాకు తెలుగువారిపై తీవ్ర ఆగ్రహం కలగడానికి కారణమయ్యాయి. దానికి తగ్గట్టే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఒక మహిళా ఎంపీ రాజీవ్‌కు అతి సన్నిహితంగా ఉంటుందన్న వార్తలు సోనియాను అమితంగా కలచివేశాయి. సోనియా జాతీయ సలహా మండలి చైర్మన్‌గా లాభదాయక పదవిలో ఉన్నందున... ఆమె లోక్‌సభ సభ్యత్వం రద్దుచేయాలని టీడీపీ నేత ఎర్రన్నాయుడు గళమెత్తారు. ఇతర విపక్ష సభ్యులూ ఈ అంశాన్ని లేవనెత్తారు. దీంతో జాతీయ సలహామండలి అధ్యక్ష పదవితోపాటు లోక్‌సభ సభ్యత్వానికీ 2006లో రాజీనామా చేయాల్సి రావడం సోనియాను తీవ్రంగా కలచివేసింది. ఆ తర్వాత ఆమె తిరిగి లోక్‌సభకు పోటీచేసి ఎన్నికయ్యారు.
ఇక 1991లో విధిలేని పరిస్థితుల్లో పి.వి.నరసింహారావును తాను ప్రధానిని చేస్తే, ఆయన తననేమాత్రం ఖాతరు చేయకపోవడంతోపాటు తనగురించి చులకనగా మాట్లాడుతున్నట్లు తెలుసుకుని ఆమె ఖిన్నురాలయ్యారు. తన పట్ల ఎన్నడూ కృతజ్ఞతాభావం చూపలేదనే కోపంతో పీవీపై ఆమెలో ద్వేషం పెరిగింది. తాము కేంద్రంలో, రాష్ట్రంలో తిరిగి అధికారానికి వచ్చిన తరువాత రాష్ట్రానికి రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రిని చేయగా... ఆయన ఎవరినీ ఖాతరు చేయకుండా స్వతంత్రంగా వ్యవహరించడం, అనేక ఆరోపణలు రావడం, 2009 ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని ఆమె ఆదేశించినా ఖాతరు చేయకుండా రోశయ్య కమిటీని ఏర్పాటు చేయడం వంటి అనుభవాలతో తెలుగువారి పట్ల సోనియాకు తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. 'నిజాయతీగల క్రైస్తవులు తాము ఇచ్చిన మాటకు ఎప్పటికీ కట్టుబడి ఉంటారు' అని సోనియాకు తన చిన్నతనం నుంచి తల్లి, తండ్రి చెప్పేవారు.
"ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తానని నేను వాగ్దానం చేశాను. రాష్ట్రంలో రెండోసారి అధికారానికి వచ్చిన తరువాత అయినా ఆ మాట నిలబెట్టుకోవాలి'' అని సోనియా పార్టీలో కీలకమైన వ్యక్తులకు రెండుమూడు సార్లు చెప్పారు. ఆమె ఈ అంశానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో దీనిద్వారా వారికి అర్థమైంది. 2009లో తాను తీసుకొన్న విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేసిన ఆంధ్రా ఎంపీకి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమె అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఆయన రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు పెద్ద మొత్తం విరాళంగా పంపితే దాన్ని తిప్పికొట్టారు. రాష్ట్ర విభజనపై ఆమె ఎంత పట్టుదలగా ఉన్నారో ఇంతకన్నా వేరే చెప్పనవసరం లేదు.
తెలివితక్కువ వ్యక్తులు కీలక స్థానాల్లో ఉన్నా, కీలక నిర్ణయాలు తెలివి తక్కువగా తీసుకుంటున్నా ఈ ప్రభుత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ముం దుకు సాగుతున్నాయన్న అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. ఆ సందేహాన్ని నివృత్తి చేస్తూ ప్రఖ్యాత చరిత్రకారుడు అర్నాల్డ్ టాయన్‌బీ తన 'స్టడీ ఆఫ్ హిస్టరీ' గ్రంథంలో ఇలా చెబుతారు. "మానవ చరిత్రలో వేలాది సంవత్సరాలు కొనసాగిన రాచరిక వ్యవస్థలో, అత్యధిక శాతం రాజులు అవివేకులే అయి ఉండేవారు. అయినా ఆయా రాజ్యాల పురోగతికి ఆ రాజుల అవివేకం అడ్డుకాలేదు''.
ఇదీ చదువు...
సోనియా స్వయంగా అంగీకరించిన ప్రకారం... ఆమె కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయి చదువులేవీ చదవలేదు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీవంటి అర్హతలు ఆమెకు లేవు. ఆమె పూర్తి చేసింది... సాంతా తెరెసా ఇన్‌స్టిట్యూట్‌లో మూడేళ్ల విదేశీ భాషల (ఇంగ్లిషు, ఫ్రెంచ్) కోర్సు. కేంబ్రిడ్జిలోని లెనాక్స్ కుక్స్ స్కూలులో ఇంగ్లిషుపై సర్టిఫికెట్ కోర్సు. పొరుగు దేశాలలో ఉపాధికోసం వెళ్లే యువతుల కోసం సాంతా తెరెసాలో ఇంగ్లిషు, ఫ్రెంచి భాషలను నేర్పే కోర్సులు ప్రవేశపెట్టారు. ఇక.. కేంబ్రిడ్జిలోని లెనాక్స్‌కుక్ స్కూల్‌ను రిటైర్డ్ ప్రొఫెసర్ ఒకరు నడిపేవారు. ఇంగ్లిషు, ఫ్రెంచి భాషలను సోనియా ఇతర దేశాల్లో తన ఉద్యోగావకాశాలను మెరుగుపరచుకునేందుకే నేర్చుకున్నారు.
భాషా వ్యాసంగం..
మొదట్లో... సోనియా సాధారణ విషయాలను, తన మదిలోని భావాలను ఇంగ్లిషులో సరిగ్గా వ్యక్తం చేయలేకపోయేవారు. ఆమె చెప్పిన అంశాలను అర్థం చేసుకోవడానికి ఇందిరాగాంధీ ఇంకో రెండుమూడు ప్రశ్నలు అడగాల్సి వచ్చేది. ఇది ఆమెకు చాలా చికాకు కలిగించేది. అందుకే పనివారితో, ఇతరులతో మాట్లాడడానికి వీలుగా హిందీ నేర్చుకోవాలని సోనియాను ఇందిర ఆదేశించారు. అతి ప్రవీణురాలైన ఒక టీచరును కూడా ఇందుకోసం నియమించారు. ఆ అధ్యాపకురాలు, సోనియాకు హిందీ అక్షరాలు నేర్పడానికి నెల రోజులపాటు ప్రయత్నించింది. అయినా, సోనియా మనస్సుకెక్కలేదు. సోనియా కూడా ఇలా నేర్చుకోవడం తనవల్ల కాదని తేల్చేశారు. ఇతరులతో వచ్చీరాని హిందీలో మాట్లాడడం మొదలుపెడితే, క్రమంగా ఆ భాష వచ్చేస్తుందని సోనియా ఒక నిర్ణయానికి వచ్చి, ఆ ఉపాధ్యాయురాలిని మాన్పించి వేశారు.
సోనియాగాంధీ విపరీత మనస్తత్వం గలవారు కాదు. అపసవ్య ఆలోచనా ధోరణిగలవారు అసలేకాదు. అయితే ఆమెకెందులోనూ కించిత్ పరిజ్ఞానం లేదు.ఏ అంశాన్నీ అవగతం చేసుకోలేరు. పైగా భారత సమాజం గురించి కనీస అవగాహన లేదు. ఎటువంటి విలువలకూ కట్టుబడి ఉండాలన్న నిబద్ధత లేదు. ఎవరికైనా... అసలు అవగాహనే కనీస స్థాయిలో ఉన్నప్పుడు అవగాహనను పెంచుకోవాలన్న కాంక్ష అంతకంటే కనీస స్థాయిలో ఉంటుంది.
- See more at: http://www.andhrajyothy.com/node/36059#sthash.V84JwTmq.dpuf

ఎవరీ సోనియా? 4

ఆమె దేశ ప్రధానమంత్రికి కోడలు! కానీ... చేతిలో డబ్బులుండేవి కావు! కేవలం నెలకు నాలుగైదువేలు వస్తాయని చెప్పగానే... ఆమె ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్ అయ్యారు. ఆ తర్వాత సోనియాపై ఇంకా ఎలాంటి ఆరోపణలు వచ్చాయి? ఖత్రోకీ కుటుంబంతో ఆమెకు పరిచయం ఎలా కలిగింది? తెలుగువాడైన పీవీ నరసింహారావు ప్రధాని ఎలా అయ్యారు? పీవీ అంటే సోనియాకు ఎందుకంత కోపం? చదవండి...
ఇండియాలో 1968 ఫిబ్రవరి నుంచి నివసిస్తున్నా 1983 వరకు సోనియా భారత పౌరసత్వం తీసుకోలేదు. ఆమె ఇటాలియన్ పాస్‌పోర్ట్ ఆధారంగానే ఇక్కడ ఉండేవారు. సంబంధిత పత్రాలను ఎప్పటికప్పుడు నవీకరించుకోవడానికి (రెన్యువల్) ఇటలీ ఎంబసీకి వెళ్లేవారు. ఒకసారి ఎంబసీలో సోనియాకు మేరియా ఖత్రోకీ తటస్థపడ్డారు. ఆమె సోనియాను గుర్తుపట్టి తననుతాను పరిచయం చేసుకున్నారు. తన భర్త ఒట్టావియో ఖత్రోకీని మెలినారీ అనే మిత్రుడు రాజీవ్‌గాంధీకి పరిచయం చేశారని మేరియా చెప్పారు. ఎంబసీలో సోనియా పని పూర్తయ్యాక కూడా వాళ్లిద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకొన్నారు. సోనియా వివాహమైన తరువాత ఇందిరాగాంధీ ఒక హెచ్చరిక చేశారు. తమ ఇంట్లో విదేశీయులు బస చేయడం తనకేమాత్రం అంగీకారం కాదని, సోనియా బంధువులు వచ్చినా ఏదైనా అతిథిగృహంలో ఉంచాల్సిందే తప్ప తమ అధికారిక నివాసంలో ఉండడం కుదరదని చెప్పారు. తల్లి చెప్పిన మాటలను రాజీవ్ «ద్రువీకరించారు.
సోనియా తల్లితండ్రులు, అక్క అనుష్క, బావ తదితరులు వస్తే ఖత్రోకీ ఇంట్లోనే ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ 1980లో తిరిగి అధికారానికి వచ్చిన తరువాత ఖత్రోకీ కార్యకలాపాలు తారస్థాయికి చేరుకున్నాయి. స్నామ్ ప్రొగెట్టీ అనే కంపెనీకి ఖత్రోకీ భారతదేశంలో ప్రతినిధి. భారత్‌లో ఎవరు రిఫైనరీ పెట్టాలన్నా, ఎరువుల ఫ్యాక్టరీ కట్టాలన్నా ఆ కాంట్రాక్టు ఈ ఇటలీ కంపెనీకి ఇచ్చి తీరాల్సిందే. ఆ విధంగా 1985 వరకు దాదాపు 60 కంపెనీల నిర్మాణ కాంట్రాక్టులు ఈ కంపెనీకి దక్కాయి. వాళ్లకు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? అని ప్రశ్నించవచ్చు. నావల్ కిశోర్‌శర్మ మంత్రిగా ఉన్నప్పుడు హజీరా, బీజపూర్, జగదీశ్‌పూర్ ఆయిల్ పైపులైను నిర్మాణ కాంట్రాక్టును, రూ.300 కోట్లు తక్కువ టెండరు వేసిన ఫ్రెంచ్ కంపెనీకి ఇచ్చారు. వెంటనే నావల్ కిశోర్ శర్మ మంత్రి పదవి పోయింది. కేబినెట్ సెక్రటరీ పి.కె.కౌల్‌ను అమెరికా రాయబారిగా పంపించారు. గెయిల్ చైర్మన్‌గా ఉన్న హెచ్.ఎస్.భీమాను తొలగించారు. ఆ తర్వాత ఖత్రోకీ ఏమైనా చెబితే రాజీవ్ చెప్పినట్టేనని ఉన్నతాధికారులందరూ భావించేవారు. బోఫోర్స్ కుంభకోణంలో ఖత్రోకీ పేరు ప్రముఖంగా వినిపించింది. స్వీడన్ కంపెనీ అయిన బోఫోర్స్‌కు ఇటలీతో సంబంధంలేదు. కానీ, ఆ కంపెనీ ప్రతినిధి విన్‌ఛద్దా.. బోఫోర్స్ ఫిరంగులను ఖత్రోకీ ద్వారా కొనిపించి, ఖత్రోకీ ఖాతాల్లోకి నలభైకోట్ల రూపాయలు బదిలీ చేశారు.
బోఫోర్స్ కుంభకోణం బయటపడగానే... రక్షణ శాఖ సహాయమంత్రి అరుణ్‌సింగ్ ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి ఎక్కడికో దూరంగా వెళ్లి ప్రశాంత జీవనం గడపసాగారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన శేఖర్‌గుప్తాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు. "నేను బోఫోర్స్ లావాదేవీలో నయాపైసా తీసుకోలేదు. రాజీవ్ కూడా తీసుకోలేదని నాకు తెలుసు. కానీ, బోఫోర్స్ నలభైకోట్లు చెల్లించిన విషయం రుజువైంది. ఆ డబ్బు ఎక్కడికి చేరిందో పూర్తిస్థాయి విచారణ జరిపి, దోషులను పట్టుకొని, ఈ పాపంలో మనకు భాగస్వామ్యం లేదని నిరూపించుకొందాం అని నేనెంత వేడుకొన్నా రాజీవ్ వినలేదు. ఈ డబ్బు ఎక్కడకు చేరిందో రాజీవ్‌కు తెలుసని నాకు అర్థమైంది'' అని తెలిపారు.
ఇటలీలో ఇండియా షాప్
సోనియా తండ్రి స్టెఫినోమైనో 1983లో చనిపోయారు. అక్కడ వారి కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సోనియా తన అక్క అనుష్కతో రెండుచోట్ల రెండు షాపులు పెట్టించారు. రివొల్టాలో ఉన్న షాప్ పేరు ఏంటికా. అర్‌బస్సాలో పెట్టిన షాప్ పేరు 'గణపతి.' ఫ్రంట్‌లైన్ పత్రిక విలేకరి నారవానే అక్కడకు వెళ్లి వివరాలు తెలుసుకోబోతే... ఆయనతో మాట్లాడేందుకు అనుష్క తిరస్కరించారు. ఒక్కొక్కటి లక్ష రూపాయలకుపైగా ఖరీదైన కశ్మీరీ శాలువాలు, ఇండియా నుంచి వచ్చిన బొమ్మలు, గాజులు, గొలుసులు విపరీతమైన ధరలకు అక్కడ అమ్ముడుపోవడాన్ని ఆ విలేకరి గమనించారు. సోనియా చొరవతోనే ఈ వస్తువులన్నీ ఇటలీకి ఎగుమతి అవుతున్నట్లు ఆ విలేకరి పేర్కొన్నారు.
ఎంతోకాలం రాజీవ్, సోనియాలను అతి సన్నిహితంగా పరిశీలించిన పాత్రికేయురాలు తవ్లీన్‌సింగ్ తన పుస్తకం 'దర్బార్'లో... రాజీవ్ ప్రధాని అయిన తరువాత ఆయన చుట్టూ ఉన్నవారు అతి కొద్దికాలంలో కోట్లు సంపాదించారని, దీనికి ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకొన్నట్లు చెప్పేవారని తెలిపారు. కానీ... తమ పలుకుబడి ఉపయోగించి ప్రభుత్వం దగ్గర పనులు ఇప్పించి, లబ్ధి పొందుతున్నట్లు తేలిగ్గా అర్థమవుతోందని తవ్లీన్‌సింగ్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందిర హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 414 సీట్లు వచ్చాయి. ఆ ప్రభుత్వాన్ని దేశంలో ప్రతిఒక్కరూ సద్భావంతో చూడడం, మీడియా పెద్దగా విమర్శించకపోవడంతో అప్పుడు జరిగిన అవినీతి కార్యకలాపాలు అంతగా వెలుగు చూడలేదు. రాజీవ్ అధికారంలో ఉన్నప్పుడు, సోనియా ప్రాభవం ఎంతగా సాగేదంటే... ఖత్రోకీ దంపతులను ఎలాంటి తనిఖీలు లేకుండా లోపలికి అనుమతించాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. ఖత్రోకీ... ప్రధాని నివాసానికే ఉన్నతాధికారులను పిలిపించి మాట్లాడేవారు. ఇదంతా సన్నిహితంగా చూసిన ఒక ఉన్నతాధికారి "ప్రధాని పదవి ఇంతగా దిగజారిన సందర్భం మరొకటి లేదు. అయినా సోనియాగాంధీకి చెప్పగలిగేదెవరు? చెబితే అర్థం చేసుకుంటారా?'' అని వ్యాఖ్యానించారు. తాను అందరికంటే గొప్పదాన్నని విశ్వసించే సోనియాగాంధీకి ప్రతిక్షణం తన నమ్మకాన్ని నిర్ధారించుకొనే, తన ఆధిపత్యాన్ని ప్రకటించుకొనే అవకాశం లభించింది.
మరో దశ...
బోఫోర్స్ కుంభకోణానికి మూలకారకురాలు సోనియానే అని, ఆమెపై రాజీవ్‌గాంధీ విరుచుకుపడ్డారని 1989 ఎన్నికల సమయంలో వార్తలు వచ్చాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని సగానికిపైగా కోల్పోయి 197 సీట్లకు పరిమితమైంది. అధికారాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలింది. కానీ... అధికారంలోకి వచ్చిన పార్టీలు ఏకతాటిపై, ఏకోన్ముఖంగా నడిచేవి కావు. గత నిర్ణయాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని ఇబ్బందిపెడదామనే ఆలోచనే వారికి లేదు. ఈ పార్టీల మధ్య చెలరేగిన విభేదాల వలన ప్రభుత్వం కుప్పకూలి 1991లో తిరిగి లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల ప్రచారంలో ఉండగానే రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారు. రాజీవ్ ఇక లేరన్న వాస్తవాన్ని సోనియాగాంధీ తట్టుకోలేరని, ఈ విషాదాన్ని పంచుకోవడానికి ఆత్మీయ మిత్రులెవరూ లేరని, ప్రతి ఒక్కరినీ ఆమె చేజేతులా దూరం చేసుకున్నారని అంతా భావించారు. "నేను వద్దని వేడుకొంటున్నా పరిస్థితుల ప్రాబల్యం వలన రాజీవ్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఇటువంటి ఘోరం జరిగే ప్రమాదం ఉందని నేను పది సంవత్సరాలుగా భయపడుతూనే ఉన్నాను. చివరకు నా భయమే నిజమైంది'' అని సోనియా ఒక ఇటాలియన్ పత్రికా విలేకరితో చెప్పారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 224 సీట్లు వచ్చాయి. సోనియాను ప్రధాని పదవి చేపట్టవలసిందిగా కాంగ్రెస్ నాయకులంతా అభ్యర్థించారు. ఆమె అందుకు తిరస్కరించి... పీఎన్ హక్సర్, ఎంఎల్ ఫోతేదార్, అరుణా అసఫాలీని ఉప రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ దగ్గరకు పంపారు. 'మీరు ప్రధాని పదవి స్వీకరించండి' అని ఆయన్ను కోరారు. తనకు వయస్సు పైబడిందని, తానంత శ్రమపడడానికి సిద్ధంగా లేనని ఆయన సున్నితంగా తిరస్కరించారు. అప్పుడు సోనియాగాంధీ తగిన ప్రధాని అభ్యర్థి ఎవరని హక్సర్‌ను ప్రశ్నించారు. ఆయన తడుముకోకుండా పీవీ నరసింహారావు పేరు చెప్పారు.
పీవీ తాను ప్రధాని అయిన వెంటనే రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ అనే సేవా సంస్థను నెలకొల్పారు. దానికి సోనియాను చైర్మన్‌గా, ఇద్దరు పిల్లల్ని డైరెక్టర్లుగా ఎంపిక చేశారు. ఢిల్లీ నడిబొడ్డున కోట్ల విలువజేసే ప్రభుత్వ భవంతిని ఆ ట్రస్టుకు ఇచ్చారు. వంద కోట్ల రూపాయలను ప్రభుత్వ గ్రాంటుగా ఇచ్చారు. సోనియాకు రాజకీయాల పట్ల చెప్పలేనంత ఏవగింపు ఉంది గనుక, కనీసం ఆమె ఈ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెంపొందించుకోవచ్చని ఆశించారు. ట్రస్టు కార్యక్రమాలు నిర్వహించడానికి, అనుభవజ్ఞులైన అధికారులను నియమించారు. సోనియా మొదటి సంవత్సరం ఆ సేవా కార్యక్రమాలపట్ల కొంత ఆసక్తి ప్రదర్శించారు. ఆ తరువాత వాటిని పట్టించుకోవడం పూర్తిగా మానివేసి, కేవలం తాను సంతకాలు పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే వివరాలు అడిగి తెలుసుకునేవారు.
ఆలోచనలతో కొత్త మలుపు
మొదట్లో... తనలో అసాధారణ శక్తులున్నాయన్న విశ్వాసం ఒకవైపు, తనలోని లోపాలు, బలహీనతలు బయటపడితే నిరాదరణకు లోనవుతాననే భయం మరోవైపు సోనియా మదిలో తిష్టవేసుకుని ఉండేవి. ఇందిరాగాంధీ చనిపోయిన తరువాత తనలో లోపాలున్నాయని మథనపడడం మాని అందరిపైనా తన ఆధిపత్యాన్ని నిర్ధారించుకోవడం, తన గొప్పదనాన్ని అందరూ అంగీకరించేలా చేయడం ప్రారంభమైంది. రాజీవ్‌గాంధీ చనిపోయిన తరువాత ఆమెలో బలీయమైన అహంభావం చోటుచేసుకొంది. "నేను కోరింది సాధించగలను. నేను ఏం చెబితే అది జరుగుతుంది' అనే భావన మరీ బలపడింది. విపరీతమైన అహంభావం ఆవహించినప్పుడు చుట్టూ ఉన్న సమాజంలో తమ పాత్ర ఏమిటని కాకుండా, తమ మనసులో ఈ సమాజానికి ఎటువంటి స్థానం ఇవ్వవచ్చన్న ఆలోచనలు మొదలవుతాయి. ఇందిర కుటుంబానికి పీవీ అత్యంత విశ్వాసపాత్రుడు. ఏ అంశంపైన అయినా తడుముకోకుండా మాట్లాడగలిగే మేధావి. ఏ పదవినైనా అత్యంత సమర్ధంగా నిర్వహించగలరని, ఆయన నిజాయతీని శత్రువులు కూడా శంకించరని పేరు ఉంది. రాజీవ్‌గాంధీ ఉన్నప్పుడు సోనియాతో ఆయన ఎప్పుడూ వివరంగా మాట్లాడిన సందర్భం లేదు. ప్రధాని అయిన తరువాత ఆయన కొన్ని కీలక అంశాల గురించి అయిదారుసార్లు వివరంగా చర్చించబోయేవారు. కానీ, ప్రతిసారి ఆయన నిర్ఘాంతపోయి, నిశ్చేష్టులై బయటకు వచ్చేవారు. సోనియా ఎవరు చెప్పినా వినడమే తప్ప తిరిగి మాట్లాడరు. కానీ, ఆమె అభిప్రాయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో పీవీ ఒకటికి రెండుసార్లు అడగడం ఇద్దరికీ ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించింది. తరువాత తన 'ఇన్‌సైడర్' నవలలో కథానాయకుడు ఆనంద్ ఒక ప్రముఖ రాజకీయవేత్తను అభివర్ణిస్తూ... "చాలా గొప్పవాడినని అతను భావిస్తాడు. తనకన్నీ తెలుసుననుకొంటాడు. అతను నోరువిప్పితే చాలు అతని అజ్ఞానం దుర్గంధంలా వ్యాపిస్తుంది'' అని పేర్కొంటారు. సోనియాకు అసలు ఏ అంశంపైనా కనీస పరిజ్ఞానం లేదని, అతి సామాన్య విషయాన్ని కూడా అవగతం చేసుకోలేదని, భారతదేశం గురించి, ఈ దేశ చరిత్ర, ప్రజల జీవన విధానం గురించి ఆమెకు లేశమాత్రమైనా అవగాహన లేదని కచ్చితంగా గుర్తించిన తరువాత... తప్పనిసరి సందర్భాలలో మాత్రమే సోనియాను పీవీ కలిసేవారు.
తప్పదంటూ తనే..
1997లో సోనియా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొన్నారు. 1998 మార్చి 14న సీతారాం కేసరిని చాలా అవమానకరమైన రీతిలో తప్పించి, సోనియాగాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎంపిక చేశారు. పేదలకు న్యాయం చేయగల శక్తి తమకు మాత్రమే ఉందని, ఇతర పార్టీలు పేదలను పట్టించుకోవని తానొక నిర్ణయానికి వచ్చానని, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకొని దేశాన్ని ఒక దారిలో పెట్టాలని తన పిల్లలిద్దరూ కోరారని, అందుకే అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నానని సోనియా చెప్పారు. 1999 ఎన్నికల్లో సోనియా దేశమంతటా విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ కు ప్రచారం చేశారు. అయినా, కాంగ్రెస్‌కు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అతి తక్కువగా 114 లోక్‌సభ సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఎన్నికలలో తాను కూడా గెలుస్తానో లేదోనన్న అనుమానంతో సోనియా అమేథీ నుంచి, బళ్లారి నుంచి కూడా పోటీ చేశారు. 2004లో, 2009లో మిత్రపక్షాల మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనతో సోనియాకు తీవ్ర విభేదాలు తలెత్తాయి. కానీ, మన్మోహన్‌తో చాలా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. మన్మోహన్ తన చదువు పూర్తయ్యాక పాతిక సంవత్సరాలపాటు రకరకాల ఉద్యోగాలు చేశారు. తర్వాత పీవీ హయాంలో ఆర్థికమంత్రిగా, ఇప్పుడు ప్రధానిగా ఉన్నా... పదవిని ఆయన ఒక ఉద్యోగంలాగానే పరిగణిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం అయిదుగంటలకల్లా ఒక ఉద్యోగిలాగా ఇంటికి వెళ్లిపోతారు. తనకీ ఉద్యోగం ఇచ్చిన వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలనుకుంటారు. పైగా రాజకీయాలను ఈసడించుకొనే సోనియా... మన్మోహన్ వృత్తిరీత్యా రాజకీయవాది కాకపోవడమే ఆయనకు సరైన అర్హతగా పరిగణించి ఉంటారు.
పీవీతో పెరిగిన అంతరం
మన్మోహన్ సింగ్‌ను పీవీ ఆర్థికమంత్రిగా నియమించి, ఆర్థిక నియంత్రణలను సడలించగానే ఆర్థిక వ్యవస్థ కొత్త ఊపిరి పోసుకుంది. పత్రికలన్నీ పీవీ పాలనను, నిర్ణయాలను ప్రస్తుతించసాగాయి. రాజకీయాల్లో పీవీకి 40 సంవత్సరాల ప్రత్యక్ష అనుభవం ఉంది. అలాగే, ఢిల్లీలో నాయకులకు భజన చేస్తూ పదవులు పొంది, పైరవీలు చేసే నాయకులెవరో ఆయనకు తెలుసు. రాష్ట్రాలలో ఆయా నాయకులకున్న బలమేమిటో తెలుసు. పీవీ దగ్గర తమ పప్పులుడకవని తెలిసిన ఆ నాయకులంతా సోనియాను కలవడం మొదలుపెట్టారు. ఆమె మొదట్లో వీరినెవరినీ ఆదరించే వారుకారు. కానీ, పీవీ తనను తరచుగా కలవకపోవడం, ప్రభుత్వంలో తీసుకొంటున్న నిర్ణయాలను వివరించకపోవడం... ఒక్కమాటలో చెప్పాలంటే తననసలు పట్టించుకోకపోవడం సోనియాను కలచివేసింది.
సోనియా గురించి పీవీ తన సన్నిహితుల దగ్గర 'దట్ పూర్ లేడీ' అంటూ చులకనగా మాట్లాడుతున్నారని, ఆమె వ్యక్తిగత వివరాలు అందరికీ చెబుతున్నారని, రాజీవ్ పాలనలో తీసుకొన్న నిర్ణయాలను పత్రికల వారికి అందించి, సోనియాను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమెకు నేతలు చెప్పేవారు. అయితే, పీవీపై తనకున్న కోపాన్ని ఉపయోగించుకుని తన అనుగ్రహం పొందడానికి వీరంతా ప్రయత్నిస్తున్నారని ఆమె గుర్తించి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయేవారు. తాము చెప్పేవి ఓపికగా వింటున్నారు గనుక ఆమె ఏకీభావం ప్రకటిస్తున్నట్లేనని ఆ నాయకులు భావించేవారు. "మీకు విధేయులుగా ఉండడం వలన పీవీ మాపై కక్ష సాధిస్తున్నారు. మా అనుచరులెవరికీ పదవులు లభించడంలేదు. మాకు సొంతపార్టీ పెట్టుకోక తప్పని పరిస్థితులేర్పడ్డాయి' అంటూ ఎన్డీ తివారీ ప్రభృతులు సోనియాతో మొరపెట్టుకొన్నారు. పార్టీ పెట్టవద్దని ఆమె వారిని వారించలేదు. 1994లో తివారీ మరో పార్టీ పెట్టారు. అర్జున్‌సింగ్ వంటి పెద్ద నాయకులు కూడా అందులో చేరారు. ప్రత్యేకమైన పార్టీ పెట్టుకున్నాక కూడా ఆ నాయకులు తరచూ సోనియాను కలుస్తున్నట్లు పీవీకి ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చేవి.
- See more at: http://www.andhrajyothy.com/node/35714#sthash.dfALcNf3.dpuf

ఎవరీ సోనియా? 3

తన తండ్రి ఆరోగ్యం సరిగా లేదని చూసి రావడానికి సోనియా ఇటలీలోని స్వగ్రామానికి వెళ్లారు. ఆమె వచ్చిందని తెలుసుకొని టురిన్ పట్టణంలోని సాంత తెరెసా స్కూలులోని ముఖ్యులు, పాత విద్యార్థులంతా సమావేశమవుతున్నారని, ఆవె కూడా ఓ పది నిమిషాలు వచ్చి వెళితే తామెంతో సంతోషిస్తామని వేడుకొన్నారు. సోనియా పదిహేనేళ్ల వయస్సులో అక్కడ స్కూలులో ఇంగ్లీషు, ఫ్రెంచి నేర్చుకోవడానికి వెళ్లి హాస్టల్‌లో ఉం డేది. ఆమెతోపాటు ఆ గదిలో మరో ఇద్దరు యువతులు ఉండేవారు. సోనియాకు ఉబ్బసం ఉండేది. రాత్రిపూట విడవకుండా దగ్గుతుండేది. ఆమె దగ్గడం వలన తమకు నిద్రపట్టడంలేదని, ఆమెకు ప్రత్యేకగది ఇవ్వాలని ఆ ఇద్దరు యువతులు వార్డెన్‌తో చెప్పారు. ప్రత్యేక గదిలేదంటూ రాత్రిపూట వరండాలో పడుకోవలసిందిగా ఆ వార్డెన్ సోనియాను కోరింది.
సోనియా కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా అందుకు అంగీకరించారు. పగలంతా ఆ ఇద్దరు యువతులతో సోనియా అతి సన్నిహితంగా ఉండేది. ఆరోజున, తమ బాల్య స్నేహితురాలు సోనియా వస్తున్నట్లు తెలుసుకుని ఆ ఇద్దరు యువతులు మహాసంబరపడ్డారు. బడి బయటే నిలబడి సోనియా కోసం ఎదురుచూడసాగారు. అనుకొన్న సమయానికి సోనియా వచ్చారు. "నువ్వు చాలా గొప్పస్థానానికి ఎదిగావని అప్పుడప్పుడు ఇక్కడ పేపర్లో వస్తుంటుంది. ని న్ను చూసి చాలా గర్విస్తున్నాం'' అని ఆ ఇద్దరు యువతులు చెప్పారు. ముందుగా వాళ్లను గుర్తుపట్టనట్లుగా సోనియా అభినయించారు. చివరకు గుర్తుకు వచ్చారని చెప్పి.. వాళ్లను వదిలేసి ముందుకు వెళ్లి అందరినీ పలుకరించసాగారు. ఆ ఇద్దరు యువతులు ఖిన్నులైపోయారు. సోనియాకు కావలసింది అదే!
రాజీవ్‌గాంధీకి డూన్ స్కూలు రోజుల నుంచి అరుణ్‌సింగ్ అత్యంత సన్నిహిత మిత్రుడు. అరుణ్‌సింగ్ కపూర్తలా రాజ వంశానికి చెందిన వ్యక్తి. మహానిజాయితీపరుడు. రాజీవ్‌గాంధీ తన తల్లి ఉన్నప్పుడే, అరుణ్‌సింగ్‌ను ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయించారు. రాజీవ్‌గాంధీ తాను ప్రధాని అయిన తరువాత రేస్‌కోర్సు రోడ్డులోకి మకాం మార్చి.. తన ప్రక్క ఇంటిని అరుణ్‌సింగ్‌కు ఇప్పించారు. అరుణ్‌సింగ్ భార్య నైనా చాలా భోళామనిషి. అందరితో కలుపుగోలుగా మాట్లాడేవారు. సోనియాకు అత్యంత సన్నిహితంగా, అంతరంగికురాలుగా ఉండేవారు. ఇద్దరి ఇళ్ల మధ్య మోకాలి ఎత్తులో చెక్కగేటు మాత్రమే ఉండేది. నైనా ఎప్పుడు పడితే అప్పుడు సోనియా ఇంట్లోకి వెళ్లగలిగేవారు. రాజీవ్ ప్రధాని అయిన తరువాత అతి సంపన్నులను అనుకరిస్తూ, సోనియా విపరీతంగా ఖర్చుపెడుతున్న విషయాన్ని నైనా ఇతర మిత్రులవద్ద ప్రస్తావించారు. ఆ విషయం సోనియా దృష్టికి వచ్చింది. దీనిపై ఆమె నైనాను పిలిచి అలా మాట్లాడవద్దని చెప్పవచ్చు లేదా గట్టిగా మందలించవచ్చు. అందుకు భిన్నంగా... తమ ఇళ్ల మధ్య ఉన్న గేటుకు తా ళం వేయించడమేకాదు, అక్కడ ఒక గార్డును కాపలా పెట్టారు. ఇది గమనించి నైనా ఖిన్నురాలయ్యారు.
(నైనాకే ఇంతటి పరాభవం ఎదురైతే, తామంతా ఇకపై సోనియాతో అత్యంత జాగ్రత్తగా మెలగాలన్న భావనతో సోనియా సన్నిహితురాలందరి ప్రవర్తనలోను మార్పు కొట్టవచ్చినట్లు కనిపించసాగింది. తన గొప్పదనం, ఆధిపత్యం నిర్ధారితమయ్యాయని సోనియా భావించుకోవడానికి ఇటువంటి సంఘటనలు ఆమెకు ఆలంబనంగా అవుతాయి.)
ఢిల్లీలో అత్యంత ప్రముఖ పాత్రికేయురాలు తవ్లీన్‌సింగ్ సోనియాతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. సోనియాకు ఆమె ఎప్పుడైనా ఫోను చేయవచ్చు. ఎప్పుడైనా వాళ్లింటికి వెళ్లవచ్చు. అలాగే, బయట పార్టీలకు వెళ్లినప్పుడు సోనియా తవ్లీన్ ప్రక్కన కొం తసేపు తప్పనిసరిగా కూర్చునే వా రు. తవ్లీన్ ఒక అపార్ట్‌మెంటు ఫ్లాట్ లో ఒంటరిగా ఉండేవారు. రాజీవ్ ప్రధాని కాకముందు సోనియా ఇంకా ఒకరిద్దరు స్నేహితురాళ్లు తవ్లీన్ ఇంటికి వెళ్లి ఒకపూటంతా గడిపేవా రు. సోనియా వాళ్లకు ఇటాలియన్ వంటలు రుచి చూపేవారు. అవి అత్యంత రుచికరంగా ఉండడం తో అందరూ ఆమెను మరీమరీ అభినందించేవారు. ఈ సాన్నిహిత్యం నేపథ్యంలో... సోనియా గాంధీని ఇంటర్వ్యూ చేయాల్సిందిగా తవ్లీన్‌ను ఇండియాటుడే సంపాదకుడు కోరారు. సోనియా ఎవరికీ ఇం టర్వ్యూ ఇవ్వదని తవ్లీన్‌సింగ్ చెప్పారు.
'మీకు తప్పకుండా ఇస్తారు' అని అరుణ్‌పూరీ చెప్పారు. 'ఆమె ఇవ్వదని తెలిసి కూడా నేనెలా అ డుగుతాను? కావాలంటే ఆమె ప్రొఫైల్ రాద్దాం' అని తవ్లీన్ పేర్కొన్నారు. సోనియాను ఆ మాట అడిగినప్పుడు... సందేహిస్తూనే అంగీకరించారు. మరుసటి రోజు ఇండియాటుడే సిబ్బంది తవ్లీన్‌తో కలిసి ప్రధాని నివాసానికి వెళ్లి సోనియాను కలిశారు. "ఇందిరాగాంధీ ప్ర ధానిగా ఉన్నప్పుడు దాదాపు పన్నేండేళ్లు ఆమెకు అతిసన్నిహితంగా వున్నారు. ఇప్పుడు ప్రధాని భార్యగా ఉన్నారు. మీరు ఇందిరాగాంధీలో గమనించిన ఉన్నత లక్షణాలేమిటి?'' అని తవ్లీన్‌తోపాటు వెళ్లిన ఒక విలేకరి చాలా వినయంగా ప్రశ్నించాడు. సోనియాగాంధీ ఏమాత్రం తడుముకోకుండా... 'పొద్దున్నే కార్యాలయానికి వెళ్లేప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ చీర ఎలా కట్టుకొనేదో, తిరిగి సాయంత్రం ఇంటికి వ చ్చేవరకు ఆ చీర అలాగే ఉండేది. ఆమె వారానికి ఒక పూట ఏమీ తినకుండా ఉపవాసం చేసేది. అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండు విషయాలు నేను ఆమె నుంచి నేర్చుకొన్నాను'' అని తెలిపారు. ఈ స మాధానం విని అక్కడున్నవారంతా బలవంతాన న వ్వు ఆపుకొన్నారు. ఆ తరువాత తవ్లీన్ ఆమెతో సరదాగా రకరకాల విషయాలు ప్రస్తావించి వాతావరణా న్ని తేలికపరిచింది.
చివరిగా.. ఇటలీకి, ఇండియాకు ఉన్న ప్రధాన తేడా ఏమిటని ఆమె ప్రశ్నించారు. దాని కి సోనియా తడుముకోకుండా ఒక రొట్టె పేరు, మూడు వంటకాల పేర్లు చెప్పారు. 'అవి ఇండియాలో ఎక్కడా దొరకవు. కాని ఇటలీలో ప్రజలు చాలా ఇష్టపడతారు' అని తెలిపారు. మరుసటి వారం సోని యా ప్రొఫైల్ ఇండియాటుడేలో ప్రచురితమైంది. అది విమర్శనాత్మకంగా లేదుగానీ, సోనియా ఆశించినరీతిలో అభినందనాపూర్వకంగా లేదు. అంతే కాదు. అక్కడక్కడా ఆమెపై వచ్చిన ఆరోపణలను కూ డా ప్రచురించారు. తరువాత తవ్లీన్‌సింగ్ సోనియాకు ఫోను చేసి, ఎ టువంటి విమర్శలు లేకుండా ఇలా మృదువుగా రాయించడానికి తా నెంతో శ్రమపడ్డానని చెప్పబోయినా.. సోనియా వినిపించుకోలేదు. మరుసటిరోజు నుంచి తవ్లీన్‌తో సంబంధాలన్నీ బంద్ అయ్యాయి. తవ్లీన్ ఫోను చేస్తే సోనియాకు ఇవ్వగూడదన్న ఆదేశాలు వెలువడ్డాయి.
ఇందిర ప్రధానిగా ఉన్న సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులెవరూ లేనప్పుడు సోనియా ప్రధాని వ్యక్తిగత సిబ్బంది ఉండే ఆఫీసులో కూర్చునేవారు. ఒకరోజు... ఓరియంటల్ ఫైర్ ఇన్సూరెన్స్ కు చెందిన ఒక వ్యక్తి వచ్చి అక్కడి సిబ్బందికి ఇన్సూరెన్సు పా లసీ అందించేందుకు వచ్చారు. తరువాత సోనియా పట్ల అతి వి నమ్రత కనబరుస్తూ... ఆమె అడిగిన వివరాలన్నీ చెప్పారు. ప్రతీ ఫ్యాక్టరీ, ప్రతి కార్యాలయానికి బీమా తప్పదని... ఏజెంటుకు ఇన్సూరెన్స్ కంపెనీ 15 శాతం కమీషన్ చెల్లిస్తుందని వివరించాడు. ఎంతో మంది ఎంపీలు కూడా ఇలా బీమా పాలసీలు చేయిస్తుంటారని తెలిపారు. 'మీరు కూడా బీమా కంపెనీలో ఏజెంటుగా చేరితే... నెలకు ఎవ్వరికీ తెలియకుండా నాలుగైదు వేలు వస్తాయి' అని చెప్పా డు. సోనియా సందేహిస్తూనే అందుకు అంగీకరించారు. ఆమె ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంటుగా ప్రధా ని నివాసాన్ని చిరునామాగా ఇవ్వడం తరువాత చాలా వివాదాస్పదమైంది. పార్లమెంటులో దీనిపై ప్రశ్న కూడా రావడంతో ఇందిర ఖిన్నురాలయ్యారు. సోనియా కంగారుపడి వెంటనే తన ఏజెన్సీని రద్దు చేసుకున్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/35227#sthash.5kLtS0bB.dpuf

ఎవరీ సోనియా?...2

తన తండ్రి ఆరోగ్యం సరిగా లేదని చూసి రావడానికి సోనియా ఇటలీలోని స్వగ్రామానికి వెళ్లారు. ఆమె వచ్చిందని తెలుసుకొని టురిన్ పట్టణంలోని సాంత తెరెసా స్కూలులోని ముఖ్యులు, పాత విద్యార్థులంతా సమావేశమవుతున్నారని, ఆవె కూడా ఓ పది నిమిషాలు వచ్చి వెళితే తామెంతో సంతోషిస్తామని వేడుకొన్నారు. సోనియా పదిహేనేళ్ల వయస్సులో అక్కడ స్కూలులో ఇంగ్లీషు, ఫ్రెంచి నేర్చుకోవడానికి వెళ్లి హాస్టల్‌లో ఉం డేది. ఆమెతోపాటు ఆ గదిలో మరో ఇద్దరు యువతులు ఉండేవారు. సోనియాకు ఉబ్బసం ఉండేది. రాత్రిపూట విడవకుండా దగ్గుతుండేది. ఆమె దగ్గడం వలన తమకు నిద్రపట్టడంలేదని, ఆమెకు ప్రత్యేకగది ఇవ్వాలని ఆ ఇద్దరు యువతులు వార్డెన్‌తో చెప్పారు. ప్రత్యేక గదిలేదంటూ రాత్రిపూట వరండాలో పడుకోవలసిందిగా ఆ వార్డెన్ సోనియాను కోరింది.
సోనియా కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా అందుకు అంగీకరించారు. పగలంతా ఆ ఇద్దరు యువతులతో సోనియా అతి సన్నిహితంగా ఉండేది. ఆరోజున, తమ బాల్య స్నేహితురాలు సోనియా వస్తున్నట్లు తెలుసుకుని ఆ ఇద్దరు యువతులు మహాసంబరపడ్డారు. బడి బయటే నిలబడి సోనియా కోసం ఎదురుచూడసాగారు. అనుకొన్న సమయానికి సోనియా వచ్చారు. "నువ్వు చాలా గొప్పస్థానానికి ఎదిగావని అప్పుడప్పుడు ఇక్కడ పేపర్లో వస్తుంటుంది. ని న్ను చూసి చాలా గర్విస్తున్నాం'' అని ఆ ఇద్దరు యువతులు చెప్పారు. ముందుగా వాళ్లను గుర్తుపట్టనట్లుగా సోనియా అభినయించారు. చివరకు గుర్తుకు వచ్చారని చెప్పి.. వాళ్లను వదిలేసి ముందుకు వెళ్లి అందరినీ పలుకరించసాగారు. ఆ ఇద్దరు యువతులు ఖిన్నులైపోయారు. సోనియాకు కావలసింది అదే!
రాజీవ్‌గాంధీకి డూన్ స్కూలు రోజుల నుంచి అరుణ్‌సింగ్ అత్యంత సన్నిహిత మిత్రుడు. అరుణ్‌సింగ్ కపూర్తలా రాజ వంశానికి చెందిన వ్యక్తి. మహానిజాయితీపరుడు. రాజీవ్‌గాంధీ తన తల్లి ఉన్నప్పుడే, అరుణ్‌సింగ్‌ను ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయించారు. రాజీవ్‌గాంధీ తాను ప్రధాని అయిన తరువాత రేస్‌కోర్సు రోడ్డులోకి మకాం మార్చి.. తన ప్రక్క ఇంటిని అరుణ్‌సింగ్‌కు ఇప్పించారు. అరుణ్‌సింగ్ భార్య నైనా చాలా భోళామనిషి. అందరితో కలుపుగోలుగా మాట్లాడేవారు. సోనియాకు అత్యంత సన్నిహితంగా, అంతరంగికురాలుగా ఉండేవారు. ఇద్దరి ఇళ్ల మధ్య మోకాలి ఎత్తులో చెక్కగేటు మాత్రమే ఉండేది. నైనా ఎప్పుడు పడితే అప్పుడు సోనియా ఇంట్లోకి వెళ్లగలిగేవారు. రాజీవ్ ప్రధాని అయిన తరువాత అతి సంపన్నులను అనుకరిస్తూ, సోనియా విపరీతంగా ఖర్చుపెడుతున్న విషయాన్ని నైనా ఇతర మిత్రులవద్ద ప్రస్తావించారు. ఆ విషయం సోనియా దృష్టికి వచ్చింది. దీనిపై ఆమె నైనాను పిలిచి అలా మాట్లాడవద్దని చెప్పవచ్చు లేదా గట్టిగా మందలించవచ్చు. అందుకు భిన్నంగా... తమ ఇళ్ల మధ్య ఉన్న గేటుకు తా ళం వేయించడమేకాదు, అక్కడ ఒక గార్డును కాపలా పెట్టారు. ఇది గమనించి నైనా ఖిన్నురాలయ్యారు.
(నైనాకే ఇంతటి పరాభవం ఎదురైతే, తామంతా ఇకపై సోనియాతో అత్యంత జాగ్రత్తగా మెలగాలన్న భావనతో సోనియా సన్నిహితురాలందరి ప్రవర్తనలోను మార్పు కొట్టవచ్చినట్లు కనిపించసాగింది. తన గొప్పదనం, ఆధిపత్యం నిర్ధారితమయ్యాయని సోనియా భావించుకోవడానికి ఇటువంటి సంఘటనలు ఆమెకు ఆలంబనంగా అవుతాయి.)
ఢిల్లీలో అత్యంత ప్రముఖ పాత్రికేయురాలు తవ్లీన్‌సింగ్ సోనియాతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. సోనియాకు ఆమె ఎప్పుడైనా ఫోను చేయవచ్చు. ఎప్పుడైనా వాళ్లింటికి వెళ్లవచ్చు. అలాగే, బయట పార్టీలకు వెళ్లినప్పుడు సోనియా తవ్లీన్ ప్రక్కన కొం తసేపు తప్పనిసరిగా కూర్చునే వా రు. తవ్లీన్ ఒక అపార్ట్‌మెంటు ఫ్లాట్ లో ఒంటరిగా ఉండేవారు. రాజీవ్ ప్రధాని కాకముందు సోనియా ఇంకా ఒకరిద్దరు స్నేహితురాళ్లు తవ్లీన్ ఇంటికి వెళ్లి ఒకపూటంతా గడిపేవా రు. సోనియా వాళ్లకు ఇటాలియన్ వంటలు రుచి చూపేవారు. అవి అత్యంత రుచికరంగా ఉండడం తో అందరూ ఆమెను మరీమరీ అభినందించేవారు. ఈ సాన్నిహిత్యం నేపథ్యంలో... సోనియా గాంధీని ఇంటర్వ్యూ చేయాల్సిందిగా తవ్లీన్‌ను ఇండియాటుడే సంపాదకుడు కోరారు. సోనియా ఎవరికీ ఇం టర్వ్యూ ఇవ్వదని తవ్లీన్‌సింగ్ చెప్పారు.
'మీకు తప్పకుండా ఇస్తారు' అని అరుణ్‌పూరీ చెప్పారు. 'ఆమె ఇవ్వదని తెలిసి కూడా నేనెలా అ డుగుతాను? కావాలంటే ఆమె ప్రొఫైల్ రాద్దాం' అని తవ్లీన్ పేర్కొన్నారు. సోనియాను ఆ మాట అడిగినప్పుడు... సందేహిస్తూనే అంగీకరించారు. మరుసటి రోజు ఇండియాటుడే సిబ్బంది తవ్లీన్‌తో కలిసి ప్రధాని నివాసానికి వెళ్లి సోనియాను కలిశారు. "ఇందిరాగాంధీ ప్ర ధానిగా ఉన్నప్పుడు దాదాపు పన్నేండేళ్లు ఆమెకు అతిసన్నిహితంగా వున్నారు. ఇప్పుడు ప్రధాని భార్యగా ఉన్నారు. మీరు ఇందిరాగాంధీలో గమనించిన ఉన్నత లక్షణాలేమిటి?'' అని తవ్లీన్‌తోపాటు వెళ్లిన ఒక విలేకరి చాలా వినయంగా ప్రశ్నించాడు. సోనియాగాంధీ ఏమాత్రం తడుముకోకుండా... 'పొద్దున్నే కార్యాలయానికి వెళ్లేప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ చీర ఎలా కట్టుకొనేదో, తిరిగి సాయంత్రం ఇంటికి వ చ్చేవరకు ఆ చీర అలాగే ఉండేది. ఆమె వారానికి ఒక పూట ఏమీ తినకుండా ఉపవాసం చేసేది. అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండు విషయాలు నేను ఆమె నుంచి నేర్చుకొన్నాను'' అని తెలిపారు. ఈ స మాధానం విని అక్కడున్నవారంతా బలవంతాన న వ్వు ఆపుకొన్నారు. ఆ తరువాత తవ్లీన్ ఆమెతో సరదాగా రకరకాల విషయాలు ప్రస్తావించి వాతావరణా న్ని తేలికపరిచింది.
చివరిగా.. ఇటలీకి, ఇండియాకు ఉన్న ప్రధాన తేడా ఏమిటని ఆమె ప్రశ్నించారు. దాని కి సోనియా తడుముకోకుండా ఒక రొట్టె పేరు, మూడు వంటకాల పేర్లు చెప్పారు. 'అవి ఇండియాలో ఎక్కడా దొరకవు. కాని ఇటలీలో ప్రజలు చాలా ఇష్టపడతారు' అని తెలిపారు. మరుసటి వారం సోని యా ప్రొఫైల్ ఇండియాటుడేలో ప్రచురితమైంది. అది విమర్శనాత్మకంగా లేదుగానీ, సోనియా ఆశించినరీతిలో అభినందనాపూర్వకంగా లేదు. అంతే కాదు. అక్కడక్కడా ఆమెపై వచ్చిన ఆరోపణలను కూ డా ప్రచురించారు. తరువాత తవ్లీన్‌సింగ్ సోనియాకు ఫోను చేసి, ఎ టువంటి విమర్శలు లేకుండా ఇలా మృదువుగా రాయించడానికి తా నెంతో శ్రమపడ్డానని చెప్పబోయినా.. సోనియా వినిపించుకోలేదు. మరుసటిరోజు నుంచి తవ్లీన్‌తో సంబంధాలన్నీ బంద్ అయ్యాయి. తవ్లీన్ ఫోను చేస్తే సోనియాకు ఇవ్వగూడదన్న ఆదేశాలు వెలువడ్డాయి.
ఇందిర ప్రధానిగా ఉన్న సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులెవరూ లేనప్పుడు సోనియా ప్రధాని వ్యక్తిగత సిబ్బంది ఉండే ఆఫీసులో కూర్చునేవారు. ఒకరోజు... ఓరియంటల్ ఫైర్ ఇన్సూరెన్స్ కు చెందిన ఒక వ్యక్తి వచ్చి అక్కడి సిబ్బందికి ఇన్సూరెన్సు పా లసీ అందించేందుకు వచ్చారు. తరువాత సోనియా పట్ల అతి వి నమ్రత కనబరుస్తూ... ఆమె అడిగిన వివరాలన్నీ చెప్పారు. ప్రతీ ఫ్యాక్టరీ, ప్రతి కార్యాలయానికి బీమా తప్పదని... ఏజెంటుకు ఇన్సూరెన్స్ కంపెనీ 15 శాతం కమీషన్ చెల్లిస్తుందని వివరించాడు. ఎంతో మంది ఎంపీలు కూడా ఇలా బీమా పాలసీలు చేయిస్తుంటారని తెలిపారు. 'మీరు కూడా బీమా కంపెనీలో ఏజెంటుగా చేరితే... నెలకు ఎవ్వరికీ తెలియకుండా నాలుగైదు వేలు వస్తాయి' అని చెప్పా డు. సోనియా సందేహిస్తూనే అందుకు అంగీకరించారు. ఆమె ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంటుగా ప్రధా ని నివాసాన్ని చిరునామాగా ఇవ్వడం తరువాత చాలా వివాదాస్పదమైంది. పార్లమెంటులో దీనిపై ప్రశ్న కూడా రావడంతో ఇందిర ఖిన్నురాలయ్యారు. సోనియా కంగారుపడి వెంటనే తన ఏజెన్సీని రద్దు చేసుకున్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/35227#sthash.5kLtS0bB.dpuf

ఎవరీ సోనియా? - 1

కాంగ్రెస్‌వారికి 'మేడమ్'
చాలామందికి 'అమ్మ'
కొందరికి 'దేవత'
మరి సోనియా గురించి మీకేం తెలుసు?
సి.నరసింహారావు రాసిన సోనియా గాంధీ వ్యక్తిత్వ విశ్లేషణ ఈ రోజు నుంచి 'ఆంధ్రజ్యోతి'లో!
ఎడ్‌వైజ్ ఆంటోనియో అల్‌బైనా మైనో... ఈమె ఎవరో మీకు తెలుసా??? పోనీ... సోనియా గాంధీ? ఈమె ఎవరో తెలియని వారు కచ్చితంగా ఉండరు. సోనియా గాంధీ అసలు పేరు... ఎడ్‌వైజ్ ఆంటోనియో అల్‌బైనా మైనో! తొమ్మిదేళ్లకుపైగా దేశాన్ని పాలిస్తున్న అధికార కూటమికి ఆమె అధినేత్రి. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఆమెది తొమ్మిదో స్థానం. ఎక్కడో ఇటలీలో సాధారణ అతివగా పుట్టిన సోనియా... ఇండియాలో అత్యంత శక్తిమంతమైన మహిళగా ఆవిర్భవించడం ఒక్కసారిగా జరిగిపోలేదు. అనేక సంఘటనలు ఆమెపై ప్రభావం చూపాయి. సోనియా జీవితంలోని ముఖ్యమైన, ఆసక్తికరమైన ఘట్టాలను ఇప్పటికే పలువురు ప్రముఖులు అక్షరాల్లో నిక్షిప్తం చేశారు. ఆ ఘట్టాలను విశ్లేషిస్తే ఆమె వ్యక్తిత్వం ఏమిటో అర్థమవుతుంది. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మానసిక విశ్లేషకుడు సి.నరసింహారావు ఆ పని చేశారు. గతంలో ఆయన వైఎస్, చంద్రబాబు, జగన్ వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తూ రాసిన వ్యాసాలను 'ఆంధ్రజ్యోతి' ప్రచురించింది. ఇప్పుడు... సోనియా జీవన విశ్లేషణనూ ప్రచురిస్తోంది. సోనియా గురించి ఎందుకు తెలుసుకోవాలంటారా? తొమ్మిదేళ్లుగా దేశ దిశను నిర్దేశిస్తున్న, ఇప్పుడు రాష్ట్ర గతిని శాసిస్తున్న ఆమె గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి... తెలుసుకోండి!
ఎవరీ సోనియా?...ఈ ప్రశ్న అడిగితే జనం ఫక్కున నవ్వొచ్చు. కానీ... ఇదే ప్రశ్నను 1999 మే 15వ తేదీన లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా అడిగారు. "సోనియా గురించి నిజంగా నాకేమీ తెలియదు. తెలిసిన వారు ఇక్కడగానీ, మనదేశంలోగాని ఒక్కరయినా ఉన్నారా?'' అని సంగ్మా ప్రశ్నించారు. అంతే... అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. సోనియాకు భారత్ గురించి ఏం తెలుసు? 'ఇండియా' అనగానే ఆమెకు గుర్తొచ్చిన విషయాలు ఏమిటి? రాజీవ్ గాంధీతో పెళ్లి ఎలా జరిగింది? మనమూ తెలుసుకుందాం! ప్రశ్నలతోనే మొదలుపెడదాం!
"అసలెవరీ సోనియా? ఆమె గత చరిత్ర ఏమిటి? అమెకున్న విద్యార్హతలేమిటి? భారతదేశంపట్ల అమెకున్న అవగాహన ఏమిటి? ఇక్కడి ప్రజలు, ఈ భిన్న సంస్కృతులు, విభిన్న భాషల గురించి ఆమెకేం తెలుసు? భారత గ్రామీణ పరిసరాలను గురించి ఆమెకేమయినా తెలుసా? భారత రాజ్యాంగం అమె ఎప్పుడయినా చదివారా? అసలు చదవగలరా? మన స్వాతంత్య్ర పోరాటం గురించి అమెకు లేశమాత్రమయినా తెలుసా? వందకోట్ల ప్రజల ఆశలు, అభిలాషలు, విద్యాసంపద, శక్తి సామర్థ్యాలు, మనందరి ఆత్మగౌరవం, హుందాతనం, నాగరికతా పరిణామ క్రమం ఈ నేలతో అనుసంధానమై ఉన్నాయి. ఇక్కడ పుట్టనివారికి ఈ దేశంలో ఉన్నత పదవిని అలంకరించే అర్హత ఉండదు'' అంటూ 1999వ సంవత్సరం మే 15వ తేదీన బొంబాయిలో పీఏ సంగ్మా కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. శరద్‌పవార్, తారిఖ్ అన్వర్, పీఏ సంగ్మా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లి నేషనలిస్టు కాంగ్రెసు పార్టీని స్థాపించడానికి సిద్ధమైన రోజులవి. అక్కడి కార్యకర్తలు అరుపులు, కేకలతో సోనియాను విమర్శించడం పట్ల తమ మద్దతును, సమ్మతిని తెలియజేస్తున్నారు. అప్పుడు సంగ్మా తిరిగి ఇలా అన్నారు. "సోనియాను వివర్శించడంకోసం నేనా మాటలు అనలేదు. సోనియాను గురించి నిజంగా నాకేమీ తెలియదు. తెలిసిన వారు ఇక్కడగాని, మనదేశంలోగాని ఒక్కరయినా ఉన్నారా?'' ఈ ప్రశ్నతో అక్కడ అందరిలో గంభీరతతో కూడిన నిశ్శబ్దం నెలకొంది.
ఆశ్చర్యం ఏమిటంటే, సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన పదిహేను సంవత్సరాల తరువాత కూడా.. ఆ గంభీర నిశ్శబ్దం అలానే కొనసాగుతోంది. ఈ పదిహేనేళ్ల కాలంలో ఆమె సొంతంగా ఒక్కటంటే ఒక్క పత్రికాగోష్టి నిర్వహించలేదు. ఒక్క పత్రికకు గానీ, ఒక్క ఛానల్‌కు గానీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. లోక్‌సభలో చదవడం కాకుండా ఒక్కసారి కూడా తనంతట తానుగా ప్రసంగించలేదు. ఈమెపై రాణి సింగ్ రాసిన పుస్తకంలో కూడా, సోనియా ఒక్క పుస్తకం చదివినట్లు అసలు ప్రస్తావించలేదు. కంప్యూటర్‌ను వినియోగించడం అసలామెకు తెలియదు. ఆమెను ఇంతకాలంగా వందలాది మంది కాంగ్రెసు నాయకులు కలిసి అనేక విన్నపాలు విన్నవించుకొన్నారు. అన్నిటికీ తల ఊపడం, ముక్త సరిగా అవును కాదు అని చెప్పడమే తప్ప ఏ నాయకుడు కూడా ఆమె తనతో విపులంగా సంభాషించినట్లు చెప్పడం జరగలేదు. ఇంతటి విశాల భారతదేశంలో, సంక్లిష్ట ప్రజాస్వామ్య వ్యవస్థలో వివిధ కీలక అంశాలపై ఆమెకున్న అభిప్రాయాలు, ఆమె విశ్వసించే విధానాలు, సిద్ధాంతాలు అసలేమయినా ఉన్నాయా? ఇంత కాలంగా బహిరంగంగానే కాదు. పార్టీ ముఖ్యుల వద్ద కూడా, తాను విశ్వసించే రాజకీయ విలువలు, విధానాల గురించి ఆమె ప్రస్తావించిన దాఖలాలేదు. అందుకే సోనియా గాంధీకి ఏ కీలక అంశం పట్ల ఎటువంటి కనీస అవగాహన లేదని నిర్ణయించుకోవచ్చు.
యాభైఏళ్ల వయసు వచ్చే వరకూ, మన దేశంలో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండి, పైగా రాజకీయాలను చీదరించుకొంటూ, రాజకీయాలకు దూరంగా ఉందామని తన భర్తను ఒప్పించి, జీవితకాలంలో రాజకీయాల జోలికి వెళ్లగూడదని నిర్ణయించుకొన్న సోనియాగాంధీ, అసలు రాజకీయాలపట్ల అవగాహనను ఏర్పరచుకోవడానికీ ఎప్పుడూ ప్రయత్నించలేదు. అంతేకాదు! ఈ దేశస్థితిగతులపట్ల కనీస పరిచయంలేని వ్యక్తికి మనదేశంలో అమలయ్యే ప్రజాస్వామ్యంపట్ల, ఇక్కడి పరిపాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ, చట్టాలపట్ల అవగాహన ఎలా ఏర్పడుతుంది? అన్నింటికీ మించి క్రమబద్ధమైన విద్యాభ్యాసం లేని సోనియాగాంధీ స్వీయ అవగాహన, ఆలోచనలే నేటి రాజకీ య విశేషాలు గా తనకు తాను పరిగ ణించుకొంటుంటారు.
బాల్యం, విద్యాభ్యాసం
రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యే రోజుల్లో లూసియానా అనే గ్రామం నుంచి ఇటలీ సైన్యంలో జేరిన నిరుపేద యువకుల్లో 'స్టెఫినోమైనో' ఒకరు. సైన్యంలో చేరిన ఆరునెలలకే స్టెఫినోతో సహా చాలామంది రష్యన్ సైన్యానికి పట్టుబడ్డారు. వారందరినీ యుద్ధ క్యాంపులో బంధించి, యుద్ధం ముగిసిన తరువాత రష్యన్ ప్రభుత్వం విడుదల చేసింది. అలా విడుదల అయిన స్టెఫినోమైనో లూసియానా గ్రామంలో తాపీ వృత్తిలో స్థిరపడి పవోలా ప్రెడెబెన్‌ను వివాహమాడాడు. వారి పెద్ద కూతురి పేరు అలెగ్జాండ్రియా. ఆమెను 'అనుష్క' అనే ముద్దుపేరుతో పిలిచేవారు. 1946 డిసెంబరు 9వ తేదీన రెండో కూతురు జన్మించింది. ఆమె పేరు 'ఎడ్‌వైజ్ ఆంటోనియా అల్‌బైనా మైనో'. ఆమెను 'సోనియా' అనే ముద్దుపేరుతో పిలిచేవారు. మూడో కూతురు పేరు నాడియా మైనో. లూసియానా బాగా వెనుకబడిన గ్రామం. అక్కడ పాఠశాల లేదు. రోడ్లు లేవు. ఆ గ్రామంలో దాదాపు అందరూ నిరక్షరాస్యులే! తాపీపని చేసి, వచ్చే కొద్దిపాటి ఆదాయంతో తమ కుటుంబం గడవడం దుర్లభమని గుర్తించిన స్టెఫినో 'అర్‌బస్సానో' అనే చిన్నపట్టణానికి తన కుటుంబంతో సహా 1950లో తరలి వెళ్లారు. అక్కడకు వెళ్లాక ఆయన ఆదాయం పెరిగింది. కానీ, పిల్లలు చదువుకోవడానికి పాఠశాల లేదు. ప్రతివారం స్టెఫినో, ఆయన భార్య క్రమం తప్పకుండా అక్కడ చర్చికి వెళ్లేవారు. ఇంట్లో కఠినంగా, నిరంకుశంగా వ్యవహరించే స్టెఫినో, చర్చి ఫాదర్ వద్ద అతి వినమ్రంగా ఉండేవారు. అన్నిటికీ ఆయన సలహాలు తీసుకొనేవారు. అక్కడ పాఠశాల లేకపోవడంతో ఆ చర్చి ఫాదరే వారానికి ఒకటి రెండు రోజులు అక్కడి పిల్లలను పోగుచేసి అక్షరాలు, చిన్న చిన్న వాక్యాలు రాయడం, చదవడం నేర్పేవారు. అనుష్క అక్షరాలు నేర్చుకోవడంపట్ల ఏమాత్రం ఆసక్తి కనపరిచేది కాదు. కానీ, సోనియా మాత్రం ఆ ఫాదర్ దగ్గరకు క్రమం తప్పకుండా వెళ్లి అక్షరాలు నేర్చుకొంది.
1960లో స్టెఫినో తన ఒక్కడి సంపాదన కుటుంబం గడవడానికి సరిపోవడంలేదని, ఇద్దరు పెద్ద పిల్లలకు పదిహేను సంవత్సరాల వయస్సు వచ్చిందని, వారిని ఎక్కడైనా ఉద్యోగంలో పెట్టించమని చర్చి ఫాదర్‌ను కోరాడు. "ఇటలీలో ఉద్యోగాలు దొరికే సమస్యే లేదు. ఈ దేశం ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. ఉద్యోగాలు పొరుగు దేశాలైన బ్రిటన్, ఫ్రాన్సులలోనే లభిస్తాయి. అనుష్కకు అక్షరజ్ఞానం లేదు గనుక ఆమెకు ఎక్కడా ఉద్యోగం లభించదు. సోనియా ఇటలీ భాష బాగానే నేర్చుకొంది. కానీ, పొరుగు దేశాలలో చిన్న ఉద్యోగం దొరకాలన్నా ఆయా భాషలు నేర్చుకోవాలి. ఆ భాషలు నేర్చుకొంటే అప్పుడేమయినా ప్రయత్నించవచ్చు'' అని ఆ చర్చి ఫాదర్ వివరించి చెప్పారు.
ప్రస్తుతం నివసిస్తున్న అర్‌బస్సానో పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో టురిన్ అనే పట్టణంలో క్రైస్తవ సన్యాసినుల (నన్స్) కోసం ఉద్దేశించిన 'ఇస్టిట్యూటో సాంతా తెరిసా' అనే ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన యువతులు అక్కడ హాస్టల్లో ఉండి ఐదో తరగతి వరకూ చదువుకొని, తరువాత క్రైస్తవ సన్యాసినులుగా వివిధ ప్రాంతాలకు వెళ్లి జీవనం గడిపేవారు. 1962లో మాధ్యమిక పాఠశాలను, ప్రక్క దేశాలలో ఉపాధికోసం వెళ్లే యువతులకోసం ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలను నేర్పే కోర్సులను కూడా ప్రవేశపెట్టారు. చర్చి ఫాదర్ సలహా మేరకు సోనియా ఆ స్కూలులో 1962లో చేరారు. అక్కడ హాస్టల్‌లో ఉంటూ 1964లో విదేశీ భాషల కోర్సును పూర్తి చేశారు. సోనియా ఆ కోర్సు పూర్తి చేసి ఇంటికి వచ్చిన తరువాత ఆమె తండ్రి స్టెఫినో చర్చి ఫాదర్ దగ్గరకు వెళ్లి ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించమని కోరారు. ఉద్యోగ ప్రకటనలు చూసి బ్రిటన్, ఫ్రాన్సులలో ఉద్యోగం కోసం చర్చి ఫాదర్ దరఖాస్తులు పంపసాగారు.
ఇంగ్లండులోని కేంబ్రిడ్జి పట్టణంలో ఒక క్రెష్‌లో (పగటి పూట తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళుతూ తమ పిల్లల్ని వదిలిపెట్టి వెళ్లే కేంద్రం) సోనియాకు ఉద్యోగం వచ్చింది. ఆమెకు వచ్చే జీతం బొటాబొటీగా సరిపోయేది. ఇంటికేమీ పంపించలేకపోతున్నానని, ఇంకేదయినా మంచి ఉద్యోగం కావాలంటే ఏంచేయాలని సోనియా తన సహ ఉద్యోగినిని అడిగింది. అప్పుడామె మొహమాటం లేకుండా చెప్పింది. 'నీకు సరైన ఇంగ్లీషు రాదు. ఇంగ్లీషులో చక్కగా మాట్లాడగలిగితే తప్ప ఇక్కడ ఉద్యోగాలు దొరకవు. ఇక్కడ ఒక రిటైర్డు ఇంగ్లీషు ప్రొఫెసరు రోజూ రెండు గంటల చొప్పున ఆరు వారాల్లో ఇంగ్లీషు నేర్పుతున్నాడు. ఆ 'లెనాక్స్‌కుక్ స్కూల్'లో చేరితే నీకు ఇంగ్లీషు వస్తుంది. అప్పుడు మంచి ఉద్యోగం పొందగలవు'' అని తెలిపింది. ఇంగ్లీషు మాట్లాడే వాతావరణం, స్కూలులో క్రమబద్ధమైన బోధనతో చిన్నచిన్న వాక్యాలతో ఇంగ్లీషులో సంభాషించగల చాతుర్యం సోనియాకు అలపడింది. ఆ స్కూల్‌లో సర్టిఫికెట్ రాగానే చాలా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేశారు. ఒక నెల లోనే కేంబ్రిడ్జి యూనివర్సిటీలోని ట్రినిటీ కాలేజీలోని కాలేజ్ బార్‌లో ఆమెకు వెయిట్రెస్ ఉద్యోగం వచ్చింది.
అప్పట్లో.. సోనియా దృష్టిలో ఇండియా!
సోనియా తన అక్క అనుష్కకు రాసిన ఒక లేఖను లండన్‌లోని టైమ్స్ పత్రిక చాలాకాలం తరువాత ప్రచురించింది. "ఆయనను మొదటిసారి చూడగానే నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. తొలి చూపులోనే ప్రేమంటే ఏమిటో నా అనుభవంలోకి వచ్చింది. ఒక రాకుమారుడు నన్ను వివాహమాడతాడని చిన్నప్పటి నుంచి కన్న కలలు నిజమయ్యాయి. వాళ్ల అమ్మ ఇండియా అనే దేశానికి ప్రధాని. ఇండియా ఎక్కడుందో నాకు తెలియదు. పాములు, ఏనుగులు, అడవులతో నిండిన దేశంగా నాకో అభిప్రాయం ఉంది. నాకా దేశం గురించి ఏదీ స్పష్టంగా తెలియదు'' అంటూ సోనియా రాసిన లేఖ పత్రికలో ప్రచురితమైంది. రాజీవ్ తన ప్రేమ గురించి తల్లితో చెప్పాడు. సోనియాకు సంబంధించిన వివరాలు చెప్పగానే ఇందిరాగాంధీ గట్టిగా తిరస్కరించింది. "ఆ అమ్మాయి అసలేమీ చదువుకోలేదు. తండ్రేమో తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తాడు. పుట్టిపెరిగింది ఇటలీలోని మారుమూల గ్రామం. ఇంగ్లీషు కూడా సరిగ్గా రాదు. అటువంటి అమ్మాయి నీకు భార్యగా ఎలా సరితూగుతుంది? మన ఇంట్లో ఎలా సర్దుకోగల్గుతుంది?'' అని ప్రశ్నించారు. తల్లిని ఒప్పించడానికి రాజీవ్ ఏ ప్రయత్నమూ చేయలేదు. లండన్ వెళ్లిన తరువాత, తన తల్లి తమ వివాహానికి అంగీకరించలేదని, నెమ్మదిగా అంగీకరించవచ్చని సోనియాతో చెప్పారు. సోనియా, రాజీవ్ కలిసి లండన్‌లోని అన్ని రెస్టారెంట్లకు వెళుతుండేవారు. భారతదేశం నుంచి వచ్చిన ప్రముఖులు రాజీవ్ ఒక యువతితో కలిసి తరచుగా లండన్‌లో కన్పిస్తున్నట్లు ఇందిరాగాంధీతో చెప్పసాగారు. "రాజీవ్‌గాంధీ అంతర్వర్తనుడు. ఎవరితోనూ కలిసేవాడు కాదు. ఎప్పుడు ముభావంగా, ఒంటరిగా ఉండేవాడు. నేను మొదట్లో ఇటలీ అమ్మాయితో పెళ్ళికి అంగీకరించలేదు. కానీ, వారి మధ్య బలమైన అనుబంధం నెలకొందని గుర్తించాక వారి వివాహానికి అంగీకరించాను'' అని ఇందిరాగాంధీ తన సన్నిహితురాలు పాపుల్ జయకర్‌తో చెప్పారు. ఇందిరాగాంధీ తన అంగీకారాన్ని తెలపగానే సోనియా ఇండియాకు వచ్చారు. ఇందిరాగాంధీ కుటుంబ మిత్రులు అమితాబ్ బచ్చన్ ఇంట్లో సోనియా 1968 జనవరి మొదటివారం నుంచి రాజీవ్‌తో నిశ్చితార్థం జరిగే 25 ఫిబ్రవరి 1968 వరకు ఉన్నారు. తరువాత ప్రధాని నివాసంలోనే వివాహం జరిగింది. మరుసటి రోజు అత్యంత వైభవోపేతంగా హైదరాబాద్ హౌస్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
"రాజీవ్‌ను మొదటిసారి చూడగానే నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. తొలి చూపులోనే ప్రేమంటే ఏమిటో నా అనుభవంలోకి వచ్చింది. ఒక రాకుమారుడు నన్ను వివాహమాడతాడని చిన్నప్పటి నుంచి కన్న కలలు నిజమయ్యాయి. వాళ్ల అమ్మ ఇండియా అనే దేశానికి ప్రధాని. ఇండియా ఎక్కడుందో నా కు తెలియదు. పాములు, ఏనుగు లు, అడవులతో నిండిన దేశంగా నా కో అభిప్రాయం ఉంది. నాకా దేశం గురించి ఏదీ స్పష్టంగా తెలియదు!''
- తన సోదరికి సోనియా రాసిన లేఖ
రాజీవ్ పరిచయం.. వివాహం
అప్పటికి... ట్రినిటీ కాలేజీలో రాజీవ్‌గాంధీ రెండు సంవత్సరాలుగా ఇంజనీరింగ్ చదువుతున్నాడు. క్లిష్టతరమైన ఆ కోర్సు చదవడం పట్ల ఆయనకు ఆసక్తి ఉండేది కాదు. ప్రొద్దున్నే కాలేజీలో ఓ గంట గడిపి బయటకు వచ్చేసేవారు. కాలేజ్ బార్‌లో కూర్చుని కాలక్షేపం చేసేవారు. పొద్దున్న పదిన్నర తరువాత ఆ బార్‌లో విద్యార్థులుగాని, అధ్యాపకులుగానీ ఎవరూ ఉండేవారు కాదు. అక్కడే రాజీవ్‌కు, సోనియాతో పరిచయం ఏర్పడింది.
పేద కుటుంబాలలో బాలికలందరికీ చిన్నతనంలో తల్లులు చెప్పే కథలు ఒకేలా ఉంటాయి. రాకుమారుడు గుర్రంపై వెళుతూ, ఓ పేద యువతి అందం చూసి నిర్ఘాంతపోయి, ఆమెను వివాహమాడడానికి నిర్ణయించుకుంటాడు. ఒక్కసారిగా పేద యువతి యువరాణి అయిపోతుంది. సోనియాకు కూడా చిన్నతనంలో తల్లి, ఇతరులు ఇటువంటి కథలే చెప్పేవారు. తానే ఇలా యువరాణిని అయినట్లు సోనియా కలలు కనేది. సోనియాతో రాజీవ్‌కు బలమైన ప్రేమానుబంధం ఏర్పడిన తరువాత ఆమెకు వివాహమాడతానిని అతను వాగ్దానం చేశారు. ఇంతలో ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీ విడిచి వెళ్లాల్సి వచ్చింది. అప్పటికి ఇందిరాగాంధీ భారత దేశ ప్రధానమంత్రి. కేంబ్రిడ్జిలో కఠినతరమైన బోధనా నిబంధనలకు రాజీవ్ తట్టుకోలేకపోయాడని గుర్తించి.. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో ఆయనను చేర్పించింది. కేంబ్రిడ్జి కాలేజ్ బార్‌లో ఉద్యోగం వదిలి సోనియా కూడా లండన్‌లోని పాకిస్థాన్‌కు చెందిన ఎగుమతి దిగుమతి వ్యాపారి సల్మాన్ తస్సీర్ వద్ద కార్యాలయ కార్యదర్శిగా ఉద్యోగంలో చేరింది. ఈమె తన వద్ద ఉద్యోగానికి పనికిరాదని భావిస్తూ "నీకు వివాహమైందా?'' అని చివరిగా సల్మాన్ ప్రశ్నించారు. 'భారత ప్రధాని కొడుకుతో నా వివాహం నిశ్చయమైంది' అని ఆమె చెప్పగానే, అతను మరో మాట మాట్లాడకుండా ఆమెకు ఉద్యోగం ఇచ్చారు.
(ఒక సాధారణ విదేశీ మహిళ... భారత దేశానికి 'యువరాజు' వంటి రాజీవ్ గాంధీకి జీవిత భాగస్వామిగా మారారు! దేశం కాని దేశంలో, పూర్తిగా కొత్తదైన వాతావరణంలో, అన్నింటికీ మించి... ఒక దేశ ప్రధానమంత్రి కోడలిగా సోనియా గాంధీ ఎలా ఇమడగలిగారు? తనను తాను ఎలా మలచుకున్నారు? అప్పటిదాకా ఆమె ఆలోచనలు ఎలా ఉండేవి? అవి ఎలా మారాయి? ఆమె మాటల్లో వినిపించే 'అమాయకత్వం' గురించి అంతా ఏమనుకునే వాళ్లు?
- See more at: http://www.andhrajyothy.com/node/34753#sthash.Im03UUtN.dpuf

9, ఏప్రిల్ 2013, మంగళవారం

ధర్మం వదిలివేసిన వైఎస్

 సిగ్గు, శరం, న్యాయం, ధర్మం వదిలివేసి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కొడుకు జగన్ కలిసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు, రాష్ట్రాన్ని కొందరు వ్యక్తులకు దోచిపెట్టి, వారి ద్వారా జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు పెట్టించారని విమర్శించారు. లక్ష కోట్ల దోపిడీకి పాల్పడిన దొంగలందరూ నేడు చంచల్‌గూడా జైలులో ఉన్నారని తెలిపారు.

ఇంకా కొంతమంది దొంగలు సెక్రటేరియేట్‌లో మిగిలారని చెప్పారు. వారిని ఇంటికి పంపించాల్సిన సమ యం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో గజదొంగలు పడ్డారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పనికిమాలిన, అవినీతి దద్దమ్మ ప్రభుత్వం ఉందని తెలిపారు. దీన్ని సముద్రంలో కలపాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ హయాం కంటే ప్రస్తుతం 300 శాతం పైగా ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటి గురించి ప్రభుత్వాధినేతలకు పట్టడం లేదని విమర్శించారు.

6, ఏప్రిల్ 2013, శనివారం

పెద్దలను తప్పించి, యువకులకు పట్టం

 కాంగ్రెస్ పార్టీని యువరక్తంతో నింపేందుకు రంగం సిద్ధమైంది. పార్టీ మండల అధ్యక్షులుగావున్న పెద్దలను తప్పించి, యువకులకు పట్టం కట్టేందుకు  నిర్ణయించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆలోచన మేరకు 45 ఏళ్లలోపు వయసున్న వారిని పార్టీ మండలాధ్యక్షులుగా నియమిస్తారు. రెండుసార్లు పదవి చేపట్టిన వారిని ఆ స్థానం నుంచి తప్పించి, నామినేటె డ్ పదవుల్లో భర్తీ చేస్తారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులకు ఆదేశాలందాయి. ఇవి అమలైతే జిల్లాలో 70 శాతం మంది పదవులను కోల్పోతారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించి పేర్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. పార్టీ అనుబంధ సంస్థల నియామకాలకూ ఇదే సూత్రాన్ని వర్తింపజేయనున్నారు.

ప్రతి పంచాయతీకి ఐదుగురు చొప్పున, మండలానికి 150 మంది క్రియాశీల కార్యకర్తలను గుర్తించి జాబితాను రూపొందిస్తున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు యువకులను, మహిళలను రంగంలోకి దించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండడంతో వారిని పార్టీలో చేర్పిస్తున్నారు.

టీచర్లకూ డ్రెస్‌కోడ్

పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలవాలని, ఇం దుకోసం వారి ఆహార్యంలోనూ హుందాతనం ఉట్టిపడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా డ్రెస్‌కోడ్ పాటిం చి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాని ఆదేశాలు జారీ అయ్యా యి. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయు లు ఆధునిక దుస్తులకు దూరంగా ఉండాల్సిందే. దీంతోపాటు సెల్‌ఫోన్లు కూడా తరగతి గదుల్లో ఉపయోగించకూడదం టూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. మరో 18 రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచీ దీన్ని అ మలుచేసేలా జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యా యి. 

ఇకపై జీన్స్‌ప్యాంట్లు, 8,4 జేబుల ప్యాంట్లు, టీ, రౌండ్ నెక్‌షర్ట్‌లు ధరించకూడదు. విద్యార్థులకు పాఠాలు భోదించే సమయంలో ఏకాగ్రత కోల్పోకుండా ఉపాధ్యాయులు సెల్‌ఫోన్ వాడాకాన్ని కూడా నిషేధించారు. విద్యార్థుల జీవితం నాలుగు గోడల మధ్య తీర్చుదిద్దబడుతుందనే కొఠారీ కమిష న్ సూచనల మేరకు ఉపాధ్యాయులు మార్గదర్శకంగా నిలిచేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయంపై పలు ఉపాధ్యాయ సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. దీన్ని సక్రమంగా అమలు చేయాలని ప్ర భుత్వం ఆదేశాలు జారీచేసింది.

ప్రతి జిల్లా కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలంటుంది...

తెలంగాణ డిమాండ్ న్యాయమైనది కాదని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అన్నారు. అది సమంజసం కాదని వ్యాఖ్యానించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాను వ్యతిరేకమని స్పష్టంచేశారు. దక్షిణాది మీడియా సంబంధిత కేసుల విచారణ కోసం హైదరాబాద్ వచ్చిన జస్టిస్ కట్జూ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై పలు వ్యాఖ్యలు చేశారు. 

'ఇది న్యాయమైన డిమాండ్ కాదు. కొందరు నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ డిమాండ్‌ని ముందుకు తెస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే, ప్రతి జిల్లా కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలంటుంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి డిమాండ్లే వినిపిస్తాయి. ఇలాంటి పరిస్థితులు దేశ సమగ్రతను దెబ్బతీస్తాయి' అని జస్టిస్ కట్జూ వ్యాఖ్యానించారు. 

తెలంగాణలో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గాయన్నారు. తాను ఇంతవరకు ఓటు హక్కు వినియోగించుకోలేదని జస్టిస్ కట్జూ ఈ సందర్భంగా తెలిపారు. పార్లమెంట్ సభ్యుల్లో మూడో వంతు మంది నేర చరితులేనని, దేశ ప్రజలు కూడా కులాలవారీగా చీలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ను భారత్‌లో కలపాల్సిందేనన్నారు.

సర్క్యులేషన్‌ను పెంచుకోవడానికి సంచలనాత్మకంగా...

కొన్ని పత్రికలు జర్నలిజం విలువలను పట్టించుకోకుండా సంచలనాత్మకంగా ప్రజలు, మహిళలను అప్రతిష్ఠపాలు చేసేలా వార్తా కథనాలు రాసి సర్క్యులేషన్‌ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పలు భారతీయ పత్రికలకు చురకలు అంటించారు. శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహాల్‌లో జరిగిన ప్రెస్ కౌన్సిల్ రెండో విచారణ కమిటీ సమావేశంలో ఆయన పత్రికలు, చానెళ్లపై దేశవ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులను విచారించారు. ఆంధ్రవూపదేశ్‌లోని తెలుగు పత్రికలు ఒకదానిపై ఒకటి దుమ్మెత్తి పోసుకుంటున్నాయని విస్మయం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి పత్రికపై వచ్చిన ఫిర్యాదులను చూసి తీవ్రంగా మందలించారు. అవాస్తవాలు రాసే పత్రికల లైసెన్సులను రద్దుపరచాలని ఆర్‌ఎన్‌ఐకి రాస్తామని హెచ్చరించారు. అభ్యంతరకరంగా వ్యవహరిస్తే ప్రకటనలు ఆపివేయాలని డీఏవీపీకి సూచిస్తానన్నారు. సాక్షి, ఈనాడులకు పరిపాటిగా మారిన పరస్పర వ్యతిరేక కథనాలపై కట్జూ విచారం వ్యక్తం చేశారు. ఈనాడు పత్రిక ఎంపీ జగన్‌మోహన్‌డ్డిని ఓఎంసీ కేసులో నిందితుడని వార్తలు రాసిందని సాక్షి ప్రతినిధులు చేసిన ఫిర్యాదుపై ప్రెస్ కౌన్సిల్ విచారణ నిర్వహించింది. 

జగన్‌ను సాక్షిగా పిలిస్తే ఈనాడు ఊహించి ఆయనను నిందితుడిగా రాసిందని పేర్కొన్న ఘటనలో ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థలు ఇలాంటి వివాదాలతో తమ ముందుకు రావద్దని కట్జూ సూచించారు. జగన్ పూర్తి వివరాలతో కూడిన ఖండనను పంపించాలని సూచించిన కట్జూ దానిని యథాతథంగా ప్రచురించాలని ఈనాడును ఆదేశించారు. అయితే జగన్ జైలులో ఉన్నందున ఖండన రాసే అవకాశంపై న్యాయవాదులు అనుమానాలు వ్యక్తం చేశారు. జైలు అధికారుల అనుమతితో ఖండనను రాయాలని కట్జూ ఆదేశించారు. అయితే వార్తలు రాయడం పత్రికల సహజ గుణమని, ప్రతిదానికి ఖండనలు రాయడం కష్టమేనని విచారణ కమిటీ సభ్యులు అభివూపాయపడ్డారు. జగన్ అవినీతిపరుడని, వందలకోట్ల కుంభకోణాలని ఏబీఎన్, టీవీ9, ఈనాడు పదే పదే దిగజారుడు కథనాలు ప్రసారం చేశాయని సాక్షి ప్రతినిధులు చేసిన ఫిర్యాదుపై కమిటీ తీవ్రంగా స్పందించింది. ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థలు పదేపదే తమ గడప తొక్కవద్దన్న కమిటీ జగన్‌ను రాజకీయంగా ఎదగకుండా చేసే కుట్రలుగా వీటిని పేర్కొన్న సాక్షి ప్రతినిధుల వాదనతో ఏకీభవించింది. తక్షణం మీడియా సంస్థలు తమిళనాడులోని మీడియేషన్ సెంటర్లో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. అక్కడ పరిష్కారం కాకపోతే కోర్టులకు వెళ్ళాలని సలహా ఇచ్చింది. 

నమస్తే తెలంగాణ నుంచి 

నిర్లక్ష్యం ఖరీదు రూ.36 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం..పాఠశాలలకు శాపం
-గత ఏడాది ఒక్కో పాఠశాలకు రూ.50 వేలు ఇచ్చిన కేంద్రం
-ఖర్చుల మార్గదర్శకాల జారీలో ఆర్‌ఎంఎస్‌ఏ తీవ్ర నిర్లక్ష్యం
- రెండుసార్లు మార్గదర్శకాలతో గందరగోళం..వస్తువుల కొనుగోళ్లలో ఆలస్యం
- మార్చిలోగా కేంద్రానికి చేరని యుటిలైజేషన్ సర్టిఫికెట్లు.. ఈ ఏడాది నిధుల్లో కోత భారీగా కోత
- ఒక్కో పాఠశాలకు రూ.35 వేల కోత.. రూ.15 వేలు విదిలింపు




రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు లేనేలేవు. ప్రయోగాలు చేయడమెలాగో పుస్తకాల్లో చదవడమే తప్ప, మెజార్టీ పాఠశాలల్లో విద్యార్థులకు బ్యూరెట్, పిప్పెట్, కొలజాడీలను ప్రత్యక్షంగా చూసిన అనుభవం లేదు. లైబ్రరీ అనే బోర్డు తప్ప పుస్తకాలను ఎరగరు. అనేక రాష్ట్రాల్లో ఈ దుస్థితిని గుర్తించిన కేంద్రం మూడేళ్ల కిందట ఉన్నత పాఠశాలలకు ఏటా కొన్ని నిధులివ్వడం మొదలుపెట్టింది. ఇచ్చిన నిధులను ఖర్చు చేసి కొనుగోలు చేసిన వస్తువులకు యూసీ(యుటిలైజేషన్ సర్టిఫికెట్)ను పాఠశాలలు సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 10,368 ఉన్నత పాఠశాలల నుంచి యూసీలను సేకరించి ఆర్‌ఎంఎస్‌ఏ రాష్ట్ర మాధ్యమిక శిక్ష అభియాన్ అధికారులు కేంద్రానికి ఆర్థిక సంవత్సరం చివర్లో కేంద్రానికి సమర్పించాలి. దీని ఆధారంగానే మరుసటి ఏడాదికి నిధులు విడుదలవుతాయి. గత ఏడాది గరిష్టంగా ఒక్కో పాఠశాలకు రూ.50 విడుదలైతే ఖర్చుపెట్టే విషయమై ఆర్నెళ్ల వ్యవధిలో రెండుసార్లు మార్గదర్శకాలను జారీ చేయడంతో వస్తువుల కొనుగోళ్లలో ఆలస్యమైంది. మార్చిలోగా యూసీలు సమర్పించకపోవడంతో 2013-14కు ఒక్కో పాఠశాలకు కేంద్రం కేవలం రూ.15వేలు మాత్రమే విడుదల చేసింది.అంటే ఈ ఏడాది కూడా రూ.50వేల చొప్పున లెక్కేస్తే రూ.36.34 కోట్లు కోతపడింది. పాఠశాలలకు ఎలాగూ నిధులివ్వని రాష్ట్ర సర్కారు, కేంద్రం నిధుల వినియోగంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శించింది. అరకొర సౌకర్యాలతో కొనసాగుతున్న పాఠశాలలకు సర్కారు నిర్లక్ష్యం శాపంగా మారింది.

గత ఏడాది రూ.50 వేలకు పెంపు 
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు పాఠశాల అభివృద్ధి నిర్వహణ గ్రాం టు కింద కేంద్రం ఏటా వేలాది రూపాయలను 2010-11 నుంచి మంజూరు చేస్తోంది. రెండేళ్లుగా రాష్ట్రంలోని 10,368 ఉన్నత పాఠశాలలకు ఈ నిధులు మంజూరవుతున్నాయి. 2010-11లో మూడు నెలలకు ఒక్కో ఉన్నత పాఠశాలకు రూ.12, 112, అలాగే 2011-12లో ఒక్కో పాఠశాలకు ఏడాదికి రూ.34,250 ఇచ్చింది. ఈ గ్రాంటు చాలడం లేదని క్షేత్రస్థాయినుంచి ఫిర్యాదులు అందాయి. ఈ మొత్తాన్ని పెంచాలని వివిధ రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో 2012-13 నుంచి ఏటా రూ.50 వేలు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు గత ఏడాది రాష్ట్రంలోని ఒక్కో ఉన్నత పాఠశాలలకు రూ.50 వేల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఇక ఉన్నత పాఠశాలల నిర్వహణకు ఢోకా లేదని భావిస్తున్న తరుణంలో తాజాగా ఒక్కో పాఠశాలకు కేంద్రం రూ.35,000ల కోత విధించింది. రాష్ట్ర మాధ్యమిక శిక్ష అభియాన్ అధికారుల నిర్లక్ష్య వైఖరే ఈ పరిస్థితికి కారణం అని తెలుస్తోంది. 

ఆరు నెలల తర్వాత మార్గదర్శిక సూత్రాల జారీ
కేంద్ర నిధులు మంజూరైన వెంటనే వాటిని ఎలా వినియోగించాలో సూచిస్తూ మార్గదర్శక సూత్రాలను విడుదల చేయడం ఆనవాయితీ. కానీ మన రాష్ట్ర అధికారులు దీనికి భిన్నంగా వ్యవహారించారు. 2012-13కు సంబంధించి ఒక్కో పాఠశాలకు రూ.50 వేలను గత ఏడాది మార్చిలో కేంద్రం విడుదలచేసింది. వీటి వినియోగానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలను రాష్ట్ర మాధ్యమిక శిక్ష అభియాన్ అధికారులు ఆగస్టులో జారీచేశారు. నిధులు మంజూరైన తర్వాత ఆర్నెళ్ల సమయం తీసుకున్నారు. ఈ నిధుల్లో ప్రయోగశాల పరికరాలకు రూ.25వేలు, లైబ్రరీ పుస్తకాలకు రూ.10 వేలు, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇంటర్‌నెట్, టెలిఫోన్‌చార్జీలకు రూ.15 వినియోగించాలని సూచించారు. ఆలస్యంగానైనా మార్గదర్శక సూత్రాలు విడుదలవడంతో వస్తువులు కొనుగోలుకు సిద్ధమవుతుండగానే కొత్త ఆదేశాలు వస్తాయంటూ ఉన్నతాధికారులు చెప్పారు. దీంతో గ్రాంటు పాఠశాల ఖాతాల్లోనే ఉండిపోయింది. ఈ ఏడాది జనవరిలో ల్యాబ్ పరికరాలకు రూ.15వేలు, రూ.10వేలు ఆటలు, సాంఘికశాస్త్రం వస్తువులు, రూ.10వేలు లైబ్రరీ, రూ.15 నీరు, విద్యుత్తు, ఇంటర్‌నెట్, టెలిఫోన్ బిల్లులకు వినియోగించాలని ఆదేశాలు జారీ ఆయ్యాయి. తక్షణమే వస్తువులు కొనుగోలుచేసి యూసీలు సమర్పించాలంటూ ఆదేశించారు. దీంతో తక్కువ సమయంలో రూ.50వేలు వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. మెజార్టీ పాఠశాలలు కొనుగోలు చేసినా, యూసీలను మండల అధికారులకు సమర్పించలేకపోయారు. యూసీలు జిల్లాకు రాకపోవడం, అక్కడి నుంచి రాష్ట్ర ఆర్‌ఎంఎస్‌ఏకు చేరలేదు. ఫలితంగా మార్చిలోగా కేంద్రానికి యూసీలు సమర్పించలేకపోయారు. 

ప్రతి పాఠశాలకు రూ.35వేల కోత 
నిబంధనల ప్రకారం మార్చి-2013లోపే యూసీలు కేంద్రానికి సమర్పించాల్సి ఉంది. ఒక ఏడాది యూసీలు మార్చిలోగా సమర్పిస్తే తదుపరి ఏడాదికి ఈ ఖర్చును పరిగణలోకి తీసుకుని నిధుల పెంపు, తగ్గింపుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో 2012-13 యూసీలు కేంద్రానికి చేరకపోవడంతో 2013-14 ఏడాదికి కనీస మొత్తంగా రాష్ట్రంలోని 10,368 ఉన్నత పాఠశాలల్లో ఒక్కో పాఠశాలకు రూ. 15వేలు మాత్రమే తాజాగా కేంద్రం విడుదలచేసింది. గత ఏడాదితో పొల్చితే ఒక్కో పాఠశాలకు రూ.35వేలు కోత పడింది. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా రూ.36.34 కోట్ల మేర నష్టం వాటిల్లింది. చేతులు కాలాక అకులు పట్టుకున్నట్లు..కోట్లకు కోట్లకు కోతలు పడ్డాక ఆర్‌ఎంఎస్‌ఏ అధికారులు ఈసారి తేరుకున్నారు. గత అనుభవం దృష్ట్యా వెంటనే మార్గదర్శక సూత్రాలు జారీచేశారు. రూ.15వేలల్లో రూ.5 వేలు లైబ్రరీ, రూ.10వేలను నీరు, విద్యుత్తు, ఇంటర్‌నెట్, టెలిఫోన్‌చార్జీలకు వినియోగించాలని (పొసీడింగ్‌నంబర్ 71/ ఆర్‌ఎంఎస్‌ఏ/ 2013 తేదీ 25-3-2013)ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్‌ఎంఎస్‌ఏ అధికారుల నిర్లక్ష్యంతో ఈ ఏడాది ఉన్నత పాఠశాలలు కనీస సౌకర్యాలు సమకూర్చుకోలేని దుస్థితి ఏర్పడింది.

(నమస్తే తెలంగాణ నుంచి )