గత పదేళ్లుగా కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తున్న ప్పటికీ తమకి ఎలాంటి ఉద్యోగ భద్రత లేదని... ఉద్యోగ భద్రత కల్పించాలన్న డిమాండుతో జూనియర్, డిగ్రీ కళాశాలల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్లు ఈ నెల 22 నుంచి సమ్మె చేస్తారని కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రకటించింది.
ఇప్పటికే ఇందుకు సంభందించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని... ఉద్యోగ భద్రత కల్పించాలన్న ప్రధాన డిమాండుతో ఈ నెల 22న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు చెప్పారు