18, నవంబర్ 2010, గురువారం

అత్త 369 మందిని బలి తీసుకుంటే..కోడలు 400 మందిని బలి తీసుకొంది

1969లో 369 మందిని ఇందిరగాంధి తెలంగాణ ప్రజల ని బలి తీసుకుంటే, నేడు సోనియాగాంధి మరో 400 మందిని బలి తీసుకున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఓ వైపు తెలంగాణ అంశంపై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బిల్లు కోసం ప్రయత్నించాల్సిన నేతలు ఓదార్పు పేరిట లక్ష రూపాయలు ఇచ్చి వారి త్యాగాలను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే బిజెపి తలా ఐదు లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, ఎవరు చస్తారో ముందుకు రావాలని ఘాటుగా వ్యాఖ్యానించారు..

కాంగ్రెస్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే పార్లమెంటు బిల్లు పెట్టి రాజకీయ ప్రక్రియ ప్రారంభించాలని ... కాంగ్రెస్ బిల్లు ప్రవేశపెడితే ఇతర పార్టీలతో నిమిత్తం లేకుండా 165 మంది సభ్యులు బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.