తన రెండో కూతురు తేజస్వినికి బాలయ్య సంబంధాలు వెతుకున్నారని... తెలుగు యువహీరోలతో పాటు చాలా మంది బాలకృష్ణ రెండో కూతురు తేజస్వినిని వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తున్నారట. అయితే ఓ యువ పారిశ్రామికవేత్తపై బాలయ్య దృష్టి పడిందని అంటున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఆ యువ పారిశ్రామికవేత్తకు హైదరాబాదులో, హైదరాబాదు పరిసరాల్లో చాలా వ్యాపారాలు ఉన్నాయట. అతనితో పెళ్లికి సంబంధించిన ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. బాలయ్య ప్రథమ పుత్రిక బ్రాహ్మణి వివాహం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు లోకేష్ తో జరిగిన విషయం తెలిసిందే.
దాసరి నారాయణ రావు దర్శకత్వం వహిస్తున్న పరమవీర చక్ర సినిమా షూటింగులో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. చాలా రిస్కీ షాట్స్ కూడా బాలయ్య చేస్తున్నాడని దాసరి నారాయణ రావు చెబుతున్నారు. సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో షూటింగ్ జరుగుతోంది. ఇదే సమయంలో సమాచారం.