18, నవంబర్ 2010, గురువారం

గోదావరి ఒడ్డున ఏక శిలతో....అయ్యప్పస్వామి దేవాలయం

దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏక శిలతో...గోదావరి ఒడ్డున స్థానిక గౌతమ ఘాట్ వద్ద నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయం పూర్తి కావచ్చింది. దాదాపు రూ. 6.60 కోట్లతో శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆలయానికి వచ్చే ఏడాది మార్చి 20న ప్రారంభోత్సవం చేసేందుకు నిర్ణయించారు.

పంపానదిలో స్నాన మాచరించినట్టే ఇక్కడ గోదావరిలో స్నానం చేసేందుకు వీలుగా నది ఒడ్డునే ఆలయాన్ని నిర్మించారు. అయ్యప్ప స్వామి పంచలోహ విగ్ర హం తయారీకి 3.5 కిలోల బంగారం, 25 కిలోల వెండిని 21 అంగుళాల ఎత్తుతో .. కోటి రూపాయలతో తయారు చేయిస్తున్నారు..

ఆలయంలో వినాయకుడు, లక్ష్మి, ఆంజనేయస్వామి, సరస్వతి, సాయినాథుడు, దత్తాత్రేయ తదితర విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భక్తుల సౌకర్యం కోసం అయ్యప్ప ఘాట్‌ను కూడా నిర్మిస్తారు