'త్రీ ఇడియట్స్’ తెలుగు రీమేక్ లో నటించాలని కోరుతూ జెమిని ఫిలిం సర్క్యూట్ వారు తన వెంటపడితే చాలా కాలం నాన్చి చివరకు ఆ సినిమాను ఓకే చేశాడు. శంకర్ డైరెక్షన్ లో సినిమా అనేసరికి మహేష్ కూడా మెత్తబడ్డాడు. అయితే ఇప్పుడా సినిమాని అరవ మేళంగా తయారు చేస్తున్న శంకర్ పద్దతి నచ్చక మహేష్ మండిపడుతున్నాడట. ‘త్రీ ఇడియట్స్’ చిత్రాన్ని తెలుగు, తమిళ నటులని నింపేస్తున్నాడు.
కేవలం మహేష్, ఇలియానా తప్ప తెలుగు వెర్షన్ లోనూ తెలుగు నటులుండరట. మహేష్ పార్ట్ ఒక్కటీ తెలుగు కోసం రీషూట్ చేస్తారట. ఇది మహేష్ కి అస్సలు నచ్చట్లేదట.ఇలాగైతే ఈ చిత్రంలో నటించనని నిర్మాతలని బెదిరిస్తున్నాడట. ఇంతదాకా వచ్చాక మళ్లీ సినిమా మొదటికొస్తుందేమోనని నిర్మాతలు హడలిపోతున్నారు.
తెలుగు నటులకి కూడా సమప్రాధాన్యమివ్వాలని శంకర్ కి సూచిస్తున్నారు. ఈ సినిమా వరకు శంకర్ దే ఫైనల్ డెసిషన్ కాబట్టి మహేష్ బాధని అతను అర్థం చేసుకుంటాడో లేక చేస్తే చెయ్, లేకపోతే పో అంటాడో చూడాలి.