శ్రీ కృష్ణ కమిటీ ఒక ట్రాష్ అని సినీ నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం కమిటీని వేశామని ప్రభుత్వాలు గేమ్ ఆడుతున్నాయని... అందరం అన్నదమ్ముల్లా ఉందాం ఆత్మీయులుగా విడి పొదాం.... ఆంధ్ర, రాయసీమలు కూడా ప్రత్యేక ప్రాంతాలు కావాలన్నారు. తాను ఉత్తరాంధ్రకు చెందినవాడిని అయినప్పటికీ తెలంగాణ కు మద్దతు ఇస్తానని తెలిపారు.
నూతన చిత్రం 'పోరు' తాను స్వీయ దర్శకత్వం వహించే నూతన చిత్రాన్ని ఆర్ నారాయణమూర్తి ప్రకటించారు. పోరు అనే టైటిల్‌కు ఆత్మహత్యలొద్దు బిడ్డ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రాన్ని జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుందన్నారు.