మద్దెలచెరువు సూరితో, కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ చేతులు కలిపి నన్ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారు. సూరి అనుచరులతో రెక్కీ నిర్వహించారు' అని వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్య లు విజయ వాడలో కలకలం సృష్టిం చాయి
పరిటాల రవీంద్ర ప్రధాన అనుచరుల్లో వల్లభనేని వంశీ ఒకరు. ఈయన విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత. 2009 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. 2004 తరు వాత కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాగానే పరిటాల రవీం ద్ర రాజ గురువు మాలపాటి వెంకటేశ్వరరావు, మరో ముఖ్య అనుచరుడు తగరకుంట ప్రభాకర్ వరుస హత్యలు జరిగాయి. వారి హత్యలతో పరిటాల రవీంద్ర ప్రధాన అనుచరుల్లో ఒకింత అభద్రతా భావం నెలకొనడంతో సందేహం లేదు.
. రవి హత్య కేసులో ప్రధాన కుట్రదారుడిగా అభి యోగాలు ఎదుర్కొంటున్న మద్దెల చెరువు సూరి కారు బాంబు కేసులో జైలు శిక్ష పడి కొన్ని నెలల క్రితం బెయిల్‌పై విడుదలయ్యారు... ఈ క్రమం లో పరిటాలను కాల్చి చంపినమొద్దు శీను హత్యకేసు నిందితుడు ఓంప్రకాష్ తొలుత తానే ఆ హత్య చేశానని ఒప్పుకున్నా ఆ తరువాత తనకు సంబంధం లేదని దివం గత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, సూరీలే మొద్దుశీనును హత్య చేయించి తనను అన్యాయంగా ఆ కేసులో ఇరికించారని ఆక్రోశం వెళ్లగక్కాడు.
. ఈ నేపథ్యంలో వంశీ తాజాగా మద్దెలచెరువు సూరిపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి