ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలో జరుగుతున్న ఉద్యమానికి ముంబై ప్రజలు నైతిక మద్దతు పలకాలని టీఆర్‌ఎస్ ముంబైశాఖ అధ్యక్షుడు బి. హేమంత్‌కుమార్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 9న వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు అధిక సంఖ్యలో తెలంగాణవాదులు హాజరు కావాలన్నారు.
ముంబై తెలంగాణ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల వీరాస్వామి తో పాటు 119 మంది టీఆర్‌ఎస్‌లో చేరారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమంలో తము కుడా భాగస్వాములవుతామని తెలిపారు.